AP Politics : ఎన్నికలు రెండు నెలలు కూడా లేవు. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ఏ క్షణమైనా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వవచ్చు. ఎందుకంటే వారికి ఆ పవర్ ఉంది. పోయిన సారి లాగా.. మార్చి 10నే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని లేదు.
ఆంధ్రాలో పాలిటిక్స్ చూస్తే సీఎం జగన్ ఎప్పుడో ముందుకెళ్లిపోయాడు. ఇప్పటికే ఆరో లిస్ట్ ప్రకటించారు.కాబట్టి అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్లిపోతున్నాడు. రెండో వైపు పరిస్థితి గందరగోళంగా ఉంది.
టీడీపీ – జనసేన కలిసి వెళుతున్నాయా? టీడీపీ, జనసేన , బీజేపీ కలిసి వెళుతాయా? అన్నది తెలియదు. ఈరోజుకు కూడా స్పష్టత లేదు. రాజమండ్రి జైలు ముందర ఎప్పుడైతే పవన్ తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. అప్పటిదాకా ఎవరూ ఊహించలేదు. కానీ అది ఇప్పటికీ పొత్తుపై ముందుకు సాగడం లేదు. బీజేపీని కలుపుతానని పవన్ అన్నా.. బీజేపీ ఈ టీడీపీ+జనసేనతో కలిసి రావడం కల్లా అని అర్థమవుతోంది.
ఇక పొత్తుధర్మం పాటించకుండా అటు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడం.. లోకేష్ సీఎం మా నాన్న చంద్రబాబు అని పేర్కొనడం.. దీనికి ప్రతిగా పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు సీట్లలో పోటీ తప్పదు అని చెప్పడంతో పొత్తు గందరగోళంలో పడిపోయింది..
ఆంధ్రా రాజకీయాల్లో అసలేం జరుగుతుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.