Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ లాంటి ఓపెనర్ ను పెట్టుకొని.. అతడు ఆడుతున్న ఇన్నింగ్స్ ను ఏమాత్రం ఉపయోగించుకోలేని దరిద్రం రాజస్థాన్ జట్టుది. విజయాలకు అనుకూలంగా మలుచుకోలేని నిర్లక్ష్యం రాజస్థాన్ ఆటగాళ్లది. చాలా జట్లలో ఓపెనర్లు సరిగ్గా ఆడటం లేదు. దీంతో వన్ డౌన్, మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతున్నది. కానీ రాజస్థాన్ జట్టులో ఇందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ రాజస్థాన్ జట్టుకు తిరుగులేని ఆయుధంగా మారాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. సూపర్ బ్యాటింగ్ తో మెరుపులు మెరిపిస్తున్నాడు.. కానీ అతడు నిర్మిస్తున్న బలవంతమైన పునాదులను రాజస్థాన్ జట్టు ఉపయోగించుకోలేకపోతోంది. ముఖ్యంగా రియాన్ పరాగ్, హిట్ మేయర్ లాంటి ఆటగాళ్లు జైస్వాల్ ఆటతీరును అందిపుచ్చుకోలేకపోతున్నారు . అందువల్ల రాజస్థాన్ జట్టు గెలుపు వాకిట బోల్తాపడుతోంది..
Also Read: 14ఏళ్ల పిల్లాడు కదా.. ఔట్ కాగానే ఏడ్చుకుంటూ వెళ్లాడు.. వైరల్ ఫోటో
ఐదు ఇన్నింగ్స్ లలో నాలుగు హాఫ్ ఇంచరీలు
రాజస్థాన్ జట్టులో యశస్వి జైస్వాల్ ఓపెనర్ ఆటగాడిగా దుమ్ము రేపుతున్నాడు. గడచిన 5 ఇన్నింగ్స్లలో అతడు ఏకంగా నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. 67, 6, 75, 51, 74 పరుగులు చేసి తన స్టామినా నిరూపించుకున్నాడు. తనను ఓపెనర్ గా పంపించినందుకు.. ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. కానీ మిగతా ఆటగాళ్లు విఫలమవుతూ రాజస్థాన్ జట్టు పుట్టి ముంచుతున్నారు. ధృవ్ జూరెల్, నితీష్ రాణా, హిట్ మేయర్, రియాన్ పరాగ్ వంటి ఆటగాళ్లు దారుణంగా విఫలమవుతున్నారు. వారి వైఫల్యం వల్ల రాజస్థాన్ జట్టు ఓటమిపాలు కావాల్సి వస్తోంది. చివరికి 14 ఇయర్స్ ఏజ్ లో వైభవ్ సూర్య వంశీ కూడా తొలి మ్యాచ్లో మెస్మరైజ్ ఇన్నింగ్స్ ఆడాడు. తన వయసు 14 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ.. ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి.. బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఇదే ఉత్సాహం.. ఇదే దూకుడు.. ఇదే దుందుడుకు స్వభావం మిగతా ఆటగాళ్లలో లోపించింది. అందువల్లే రాజస్థాన్ జట్టు వరుస ఓటములు ఎదుర్కొంటోంది. ఇప్పటికైనా రాజస్థాన్ జట్టు వైఫల్యాలను పక్కనపెట్టి.. విజయాలు సాధిస్తే కాస్తలో కాస్త ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశాలుంటాయి. లేకుంటే గ్రూప్ నుంచే రాజస్థాన్ జట్టు పెట్టే బేడా సర్దుకోవాల్సి ఉంటుంది. సంజు శాంసన్ గాయం వల్ల జట్టుకు దూరం అయ్యాడు. ఇకపై అతడు మ్యాచ్ లు కూడా ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ లెక్కన రియాన్ పరాగ్ రాజస్థాన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సంజు స్థానంలో వైభవ్ సూర్య వంశీ జట్టులోకి వచ్చాడు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో తను ఏంటో నిరూపించుకున్నాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు.
Also Read: అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు లక్నో.. రాజస్థాన్ దరిద్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతుందేమో?