Yashasvi Jaiswal record: ప్రస్తుత టీం ఇండియాలో భీకరమైన ఫామ్ లో ఉన్న ఆటగాడు ఎవరు అంటే.. వెంటనే వచ్చే సమాధానం యశస్వి జైస్వాల్. ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లోని మారుమూల గ్రామంలో పుట్టిన అతడు.. పేదరికాన్ని జయించి ఇక్కడదాకా వచ్చాడు. క్రికెట్ మీద ఉన్న ఇష్టంతో రోడ్లమీద పడుకున్నాడు. పానీ పూరి అమ్మే వ్యక్తి దగ్గర పని చేశాడు. పాల కేంద్రంలో రాత్రిపూట ప్యాకెట్లు వేసేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.. తిండి లేక పస్తులు ఉన్నాడు.. మంచినీళ్లు తాగి బతికాడు.. చివరికి అదృష్టం కలిసి వచ్చి క్రికెటర్ అయ్యాడు.. తన కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాడు కాబట్టి ఈ స్థాయికి ఎదిగాడు.
ప్రస్తుత టీమ్ ఇండియాలో ఓపెనర్ గా అదరగొడుతున్నాడు జైస్వాల్. మైదానంలో బీభత్సంగా పరుగులు తీస్తున్నాడు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే.. మైదానం ఎలా ఉన్నా సరే.. బౌలర్ ఎవరైనా సరే.. లెక్కపెట్టకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న వెస్టిండీస్ సిరీస్లో రెండు శతకాలు నమోదు చేశాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన అతడు.. రెండో టెస్టులో కూడా అదే జోరు కొనసాగించాడు. రెండవ టెస్టులో ఏకంగా 175 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ చేస్తాడు అనుకుంటున్న క్రమంలో.. ఊహించని విధంగా రన్ అవుట్ అయ్యాడు. దీంతో అతడు నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లాల్సి వచ్చింది.
వాస్తవానికి జైస్వాల్ ఈ స్థాయిలో అదరగొట్టడానికి ప్రధాన కారణం ఎవరు? అనే ప్రశ్న మీడియాలో ప్రముఖంగా వ్యక్తమైంది. అయితే దీనికి ఇన్ని రోజులకు సమాధానం లభించింది. జైస్వాల్ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడానికి ప్రధాన కారణం అతడి రూమర్ గర్ల్ ఫ్రెండ్ మ్యాడి హామీల్టన్.. విదేశీయురాలైన హమిల్టన్ తో జైస్వాల్ ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది.
ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఆమె ఇక్కడే మకాం వేసింది. అతడు ఆడే మ్యాచ్లు మొత్తానికి హాజరైంది. ఆమెతోపాటు సోదరుడు కూడా ఉన్నాడు. అప్పట్లోనే వీరిద్దరూ హోటల్లో కనిపించిన దృశ్యాలు సంచలనం సృష్టించాయి. అయితే దీనిపై జైస్వాల్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. హామిల్టన్ కూడా మీడియా అడిగితే ముసి ముసిగా నవ్వుకుంటూ వెళ్లిపోయింది. తాజాగా జరుగుతున్న వెస్టిండీస్ సిరీస్ లోను హామీల్టన్ మైదానంలో కనిపించింది. జైస్వాల్ సెంచరీ చేసిన తర్వాత ఎగిరి గంతులు వేసింది. ఇదే సమయంలో సెంచరీ అనంతరం జైస్వాల్ లవ్ సింబల్ తో హమిల్టన్ ను మరిత ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో వీరిద్దరూ తమ బంధాన్ని పరోక్షంగానే వ్యక్తం చేస్తున్నట్టు నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.