Yash Dayal : సుదీర్ఘ చరిత్రలో ఉన్న క్రికెట్లో ఇలాంటి అనుభవం ఎదుర్కోలేని ఆటగాడు లేదంటే అతిశయోక్తి కాదు. అంతటి బ్రాడ్ మన్ ఒకానొక సందర్భంలో జట్టుకు దూరమయ్యాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఐరన్ లెగ్ ముద్రపడ్డాడు. కాకపోతే ఆ అవరోధాల నుంచి వారు పాఠాలు నేర్చుకొని క్రికెట్ లెజెండ్స్ అయ్యారు. వారిని ఆదర్శంగా తీసుకొని.. అదే తీరుగా పేరు తెచ్చుకోవాలని బలంగా అడుగులు వేస్తున్నాడు యశ్ దయాళ్. చెన్నైతో శనివారం జరిగిన మ్యాచ్లో.. చివరి ఓవర్ అద్భుతంగా వేసి.. రెండు పరుగుల స్వల్ప తేడాతో బెంగళూరు జట్టుకు విజయాన్ని అందించాడు యష్ దయాల్.. అంతేకాదు కన్నడ అభిమానుల దృష్టిలో హీరో అయిపోయాడు. ఓవర్ నైట్ స్టార్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు.
Also Read : దరిద్రం నట్టింట్లో ఉన్నాకా.. ఓడిపోక ఏం చేస్తారు? పాపం చెన్నై జట్టు..
నాడు ఏం జరిగిందంటే..
2023 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ టైటాన్స్ జట్టులో యశ్ దయాళ్ కీ బౌలర్ గా ఉన్నాడు. ఓ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. గుజరాత్ మ్యాచ్ గెలవాలంటే చివరి ఐదు బంతుల్లో 28 పరుగులు చేయాలి. అప్పుడు గుజరాత్ తరఫున యశ్ దయాళ్ బౌలింగ్ వేస్తున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున రింకూ సింగ్ ఐదు బంతులను ఐదు సిక్సర్లుగా మలిచాడు. దీంతో యశ్ ఒక్కసారిగా విలన్ అయిపోయాడు. ఇక తర్వాత అతడు నిద్ర లేని రాత్రులను గడిపాడు. ఇదే విషయాన్ని అతడి తల్లి అనేక సందర్భాల్లో పేర్కొంది..
ఇక ప్రస్తుత సీజన్లో యశ్ దయాళ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ముఖ్యంగా చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో.. చివరి ఓవర్ లో సూపర్బ్ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. చెన్నై విక్టరీ సాధించాలంటే 15 రన్స్ కావలసిన సందర్భంలో.. ఒకవికెట్ పడగొట్టి… 12 రన్స్ మాత్రమే ఇచ్చి.. బెంగళూరును విన్నింగ్ టీమ్ చేశాడు. తన బౌలింగ్లో మహేంద్రసింగ్ ధోనిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు… చెన్నై జట్టుకు షాక్ ఇచ్చిన యష్ దయాళ్.. ఒక్కసారిగా బెంగళూరు జట్టుకు హీరో అయిపోయాడు. ఇక గత ఏడాది చెన్నై జట్టు ప్లే ఆఫ్ వెళ్లకుండా యష్ దయాల్ కీలకపాత్ర పోషించాడు. నాటి మ్యాచ్లో చెన్నైతో బెంగళూరు తలపడింది. అప్పుడు చెన్నై విజయానికి చివరి అర్బంతుల్లో 17 పరుగులు కావాలి. అప్పుడు కూడా రవీంద్ర జడేజా, ధోని ఉన్నారు. యష్ చేసిన తొలి బంతికి ధోని సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత మరుసటి బంతికి ధోనిని యష్ అవుట్ చేశాడు. ఇక చివరి ఐదు బంతుల్లో ఏడుపరుగులు మాత్రమే ఇచ్చి చెన్నై జట్టుకు కోలుకోలేని షాకిచ్చాడు. 2023 ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టులో యాష్ దయాల్ కీలక బౌలర్ గా ఉండేవాడు… కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ అతని జీవితాన్ని పాతాళంలోకి తోసివేసింది. అప్పటిదాకా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్న అతడు.. కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓవర్లో31 రన్స్ ఇవ్వడంతో విలన్ అనే ముద్ర వేసుకున్నాడు. 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వచ్చాడు. గత సీజన్లో 15 మ్యాచ్లలో 15 వికెట్లు తీశాడు. ఇక మెగా వేలంలో బెంగళూరు ఇతడిని రిటైన్ చేసుకోవడం విశేషం. ఇతడి కోసం మహమ్మద్ సిరాజ్ సైతం బెంగళూరు వదులుకుంది. దీనినిబట్టి యష్ మీద బెంగళూరు యాజమాన్యానికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.