Chennai Super Kings : చెన్నై జట్టు పేరు చెప్తే తిరుగులేని దూకుడు గుర్తుకు వస్తుంది. ఎదురనేది లేని పరాక్రమం కళ్ళ ముందు కనిపిస్తుంది. సిసలైన టెక్నిక్.. అసలైన మ్యాజిక్.. అనితర సాధ్యమైన పరాక్రమం చెన్నై జట్టు సొంతం. అందువల్లే ఐపీఎల్లో పాంచ్ పటాకా సాధించింది. ముంబై జట్టుతో సమానంగా నిలిచింది. కానీ అటువంటి చెన్నై జట్టు ఈసారి మాత్రం ఇబ్బందికరమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. అసలు ఆడుతోంది చెన్నై జట్టేనా అనే అనుమానం కలుగుతోంది. భీకరమైన బ్యాటింగ్ లైన్ అప్ నేలచూపులు చూస్తోంది. భయంకరమైన బౌలింగ్ ధారాళంగా పరుగులు ఇస్తోంది. పాదరసం లాగా కనిపించే ఫీల్డింగ్ నాసిరకం జట్టును గుర్తుకు తెస్తోంది. మొత్తంగా చూస్తే అన్ని విభాగాలలో అట్టర్ ఫ్లాఫ్ అయి చెన్నై జట్టు.. పాయింట్లు పట్టికలో లాస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. వరుసగా ఓటములు ఎదుర్కొంటూ.. గెలవాల్సిన మ్యాచ్ లోనూ ఓడిపోతూ పరువు తీసుకుంటున్నది. ధైర్యానికి.. పరాక్రమానికి సిసలైన అడ్రస్ గా ఉండే ఎల్లో ఆర్మీ.. చేవలేని తనంతో కనిపిస్తోంది.
Also Read :చివరి రెండు ఓవర్లలో.. ఇంత విధ్వంసమా.. చెన్నై బౌలర్లకు ఏడుపొకటే తక్కువ
గెలిచే దశలో..
ఇక బెంగళూరు తో శనివారం జరిగిన మ్యాచ్ లో బెంగళూరు గెలిచింది అనేకంటే.. చెన్నై ఓడిపోయింది అనడం కరెక్ట్. ఎందుకంటే 16 ఓవర్ లో ఆయుష్ మాత్రే అవుట్ అయిన తర్వాత బ్రేవిస్ మైదానం లోకి వచ్చాడు. ఎంగిడి వేసిన తొలి బంతికి అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. వాస్తవానికి రిప్లై లో బంతి ప్యాడ్ ను కాకుండా బ్యాట్ ను తగిలినట్టు కనిపించింది. ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వడంతో.. రివ్యూకి వెళ్లడానికి బ్రేవిస్, రవీంద్ర జడేజా చాలాసేపు చర్చించారు. అప్పటికే రివ్యూ టైం ముగిసిపోవడంతో.. బ్రేవిస్ మైదానం నుంచి వెళ్లిపోయాడు. గత మ్యాచ్లో బ్రేవిస్ అదరగొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కానీ ఈ మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం వల్ల అవుట్ అయ్యాడు. ఒకవేళ బ్రేవిస్ గనక అవుట్ అవకుండా ఉంటే చెన్నై జట్టు కచ్చితంగా విజయం సాధించడానికి ఆ జట్టు అభిమానులు అంటున్నారు. కానీ అతడు అవుట్ అవ్వడం వల్ల ధోని మైదానంలోకి వచ్చాడు. అతడు ఆశించినంత స్థాయిలో సత్తా చూపించలేకపోవడం.. చివర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యష్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ వేయడంతో.. చెన్నై జట్టుకు ఓటమి తప్పలేదు. రెండు పరుగుల తేడాతో గెలిచిన ఆనందం బెంగళూరుది అయితే.. అన్ని వనరులు కూడా చేతిలో ఉంచుకొని ఓడిపోయిన దౌర్భాగ్యం చెన్నై జట్టుది. ఈ సీజన్లో ఎన్నో ఓటములను చెన్నై జట్టు ఎదుర్కొన్నప్పటికీ.. బెంగళూరు తో ఓడిపోయిన మ్యాచ్ చెన్నై జట్టుకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకంటే ఇది చెన్నై జట్టు గెలవాల్సిన మ్యాచ్. గెలిచే దశలో వదిలేసుకున్న మ్యాచ్.
Inject in timer nhi dikh rhaa
25 sec pic.twitter.com/3eUenuGK1R— (@itsmihir412) May 3, 2025