RCB Vs CSK: ఆర్సిబిని ప్లే ఆఫ్ చేర్చిన యశ్ దయాల్.. ఒక్కరోజులో హీరో అయిపోయాడిలా..

బెంగళూరు టీం ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిస్తేనే బెంగుళూర్ ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవుతారు అనే ఒక క్లిష్ట పరిస్థితిలో బరిలోకి దిగింది. ఇక దానికి తగ్గట్టుగానే అద్భుతమైన ప్రదర్శనను కూడా కనబరిచింది.

Written By: Gopi, Updated On : May 19, 2024 9:07 am

RCB Vs CSK

Follow us on

RCB Vs CSK: ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య డూ ఆర్ డై గా సాగిన మ్యాచ్ లో బెంగళూరు టీం ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిస్తేనే బెంగుళూర్ ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవుతారు అనే ఒక క్లిష్ట పరిస్థితిలో బరిలోకి దిగింది. ఇక దానికి తగ్గట్టుగానే అద్భుతమైన ప్రదర్శనను కూడా కనబరిచింది. ఇక చివర్లో ఆర్సిబి బౌలర్ అయిన యశ్ దయాల్ వేసిన బంతులను సరిగ్గా ఎదురుకోలేని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్స్ చేతులు ఎత్తేసారు.

దానివల్ల చెన్నై దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది. నిజానికి ఒక దశలో ఈ మ్యాచ్ చెన్నై గెలుస్తుంది అనేలా ఆ టీమ్ బ్యాట్స్ మెన్స్ బాగా ఆడారు. కానీ చివర్లో అంచనాలకు తగ్గట్టుగా చెన్నై బ్యాటింగ్ చేయలేకపోయింది. దాని వల్లే విజయం ఆర్సిబీ వైపు మొగ్గు చూపింది. ఇక చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం ఉండగా యశ్ దయాల్ బౌలింగ్ చేశాడు. ఇక అందులో మొదటి బాల్ ని ధోని సిక్స్ కొట్టాడు. దాంతో మ్యాచ్ మొత్తం చెన్నై వైపు తిరిగింది అనుకున్నారు కానీ ఇక రెండో బాల్ కి ధోని అవుట్ అయ్యాడు. ఇక మూడోవ బంతికి శార్ధుల్ ఠాకూర్ బ్యాటింగ్ వచ్చినప్పటికి దాన్ని డాట్ బాల్ గా మలిచాడు. ఇక నాలుగొవ బాల్ సింగిల్ రాగా, లాస్ట్ రెండు బంతుల్లో పది పరుగులు అవసరం ఉండగా, జడేజా స్ట్రైక్ లో ఉన్నాడు.

ఇక యశ్ దయాల్ ఆ చివరి రెండు బంతులు కూడా డాట్ బాల్స్ గా మార్చడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.ఇక చివరి ఓవర్లో చెన్నై ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవ్వాలంటే 17 పరుగులు అవసరం ఉండగా, యశ్ దయాల్ వచ్చి తన బౌలింగ్ మాయాజాలం తో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఆర్సిబి గెలుపులో యశ్ దయాల్ కీలకపాత్ర వహించడమే కాకుండా ఇక బెంగుళూర్ అభిమానుల్లో హీరోగా నిలిచాడు. ఈ విజయంతో ఆర్సిబి ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయింది. ఇక ఈ ఉత్కంఠ పోరులో ఆర్సిబి బౌలర్లే పైచేయి సాధించారు.

ఇక దీంతో ఈ సీజన్ లో వరుసగా బెంగళూరు టీం ఆరోవ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక మొత్తానికైతే ఈ మ్యాచ్ లో భారీ విక్టరీని సాధించి ప్లే ఆఫ్ చేరడంతో ఆ టీం సపోర్టర్స్ అందరూ సంబరాలను చేసుకుంటున్నారు… మరి ప్లే ఆఫ్ లో కూడా సత్తా చాటి ఫైనల్ కి వెళ్లి ఈసారైనా కప్పు గెలుచుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…