Sunrisers Hyderabad: కోట్లల్లో నష్టం వచ్చినప్పటికీ.. అభిమానుల కోసం కావ్య పాప సంచలన నిర్ణయం..

పేటీఎం లేదా పేటీఎం ఇన్సైడర్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన వారి ఖాతాల్లో డబ్బు తిరిగి జమకానుంది. దీనికోసం సన్ రైజర్స్ యాజమాన్యం అభిమానులకు మెయిల్స్ చేయడం మొదలుపెట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 19, 2024 8:57 am

Sunrisers Hyderabad

Follow us on

Sunrisers Hyderabad: ఐపీఎల్ అంటే క్యాష్ రీచ్ లీగ్ అంటారు. పెద్దపెద్ద కార్పొరేటర్లు టీమ్ లను లీడ్ చేస్తారు కాబట్టి.. వారికి డబ్బే పరమావధి అనుకుంటారు. టికెట్ల అమ్మకం నుంచి జెర్సీల విక్రయం వరకు ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇక మధ్య మధ్యలో సంజీవ్ గోయెంకా వంటి వారు తమ కార్పొరేట్ తనాన్ని రుచి చూపిస్తూనే ఉంటారు.. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మిగతా జట్ల ఓనర్లు ఏమోగానీ.. హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ మాత్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కోట్లలో నష్టం వస్తున్నప్పటికీ అభిమానుల కోసం డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా మే 16 గురువారం నాడు హైదరాబాద్, గుజరాత్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు హైదరాబాద్ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అయితే విపరీతంగా కురిసిన వర్షం హైదరాబాద్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో వారు వీళ్ళకు వేలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన టికెట్లకు జస్టిఫై లేకుండా పోయింది. దీంతో అభిమానుల బాధను అర్థం చేసుకున్న కావ్య ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ మైదానానికి వచ్చిన ప్రేక్షకులకు డబ్బు తిరిగి ఇస్తామని ప్రకటించింది. త్వరలోనే ప్రేక్షకుల డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్టు సన్ రైజర్స్ యాజమాన్యం వెల్లడించింది.

పేటీఎం లేదా పేటీఎం ఇన్సైడర్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన వారి ఖాతాల్లో డబ్బు తిరిగి జమకానుంది. దీనికోసం సన్ రైజర్స్ యాజమాన్యం అభిమానులకు మెయిల్స్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇందులో చాలామంది అభిమానులు బ్లాక్ లో టికెట్లు కొనుగోలు చేశారు. దీనికోసం వేలకు వేలు ఖర్చు చేశారు. అలాంటి వారికి కావ్య పాప సాయం అందదు. వారికి ఒక పైస కూడా వెనక్కి వచ్చే అవకాశం లేదు. దీంతో బ్లాక్లో టికెట్లు కొన్న వారు మొత్తం బాధపడిపోతున్నారు. ఇదే సమయంలో బ్లాక్ లో టికెట్లు విక్రయించిన వారు పండగ చేసుకుంటున్నారు.. ఎందుకంటే అటు టికెట్ ధరను రెట్టింపుకు విక్రయించి.. చివరికి సన్ రైజర్స్ యాజమాన్యం ఇచ్చే రీఫండ్ వారికి అదనపు ప్రయోజనాన్ని చేకూర్చనుంది. అయితే తమ విషయంలోనూ ఉదారత చూపాలని బ్లాక్ మార్కెట్లో టికెట్లు కొన్న అభిమానులు సన్ రైజర్స్ యాజమాన్యానికి విన్నవిస్తున్నారు.. మరి వీరి విన్నపాన్ని కావ్య మారన్ అంగీకరిస్తుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.