https://oktelugu.com/

Anil Ravipudi: నిర్మాతలు ముందుకు రాకున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నందమూరి హీరో, పవన్ కళ్యాణ్ ప్రమేయం ఉంటే?

పటాస్ కళ్యాణ్ రామ్ కెరీర్లో అతి పెద్ద హిట్ గా ఉంది. కళ్యాణ్ రామ్ కి గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిన చిత్రం అది. రూత్ లెస్ రౌడీ పోలీస్ గా కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ చక్కగా కుదిరింది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 19, 2024 / 09:18 AM IST

    Anil Ravipudi

    Follow us on

    Anil Ravipudi: స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ ఇచ్చిన మాట ప్రకారం నాతో సినిమా చేశారని. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. విషయంలోకి వెళితే.. నందమూరి కళ్యాణ్ కెరీర్లో హిట్స్ కంటే ప్లాప్స్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. కెరీర్ బిగినింగ్ లో అతనొక్కడే చిత్రంతో హిట్ కొట్టిన ఆయనకు మరలా క్లీన్ హిట్ పడలేదు. ఓం 3D అనే భారీ బడ్జెట్ మూవీలో స్వయంగా నటించి, నిర్మించాడు. ఆ మూవీ దారుణ పరాజయం చూసింది.

    కళ్యాణ్ రామ్ ఆర్థికంగా నష్టపోయాడు. ఆ సమయంలో అనిల్ రావిపూడి పటాస్ స్క్రిప్ట్ చెప్పాడట. కళ్యాణ్ రామ్ ఫార్మ్ లో లేడు. అనిల్ రావిపూడి కొత్త దర్శకుడు. దాంతో నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదట. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడికి ఇచ్చిన మాట ప్రకారం పటాస్ మూవీ చేశారట. స్వయంగా పటాస్ మూవీ నిర్మించాడట.

    పటాస్ కళ్యాణ్ రామ్ కెరీర్లో అతి పెద్ద హిట్ గా ఉంది. కళ్యాణ్ రామ్ కి గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిన చిత్రం అది. రూత్ లెస్ రౌడీ పోలీస్ గా కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ చక్కగా కుదిరింది. కళ్యాణ్ రామ్ ఆ పాత్రకు న్యాయం చేశాడు. కొత్త దర్శకుడైన అనిల్ రావిపూడిని నమ్మినందుకు కళ్యాణ్ రామ్ అద్భుతమైన విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఒకవేళ ఈ మూవీ పవన్ కళ్యాణ్ చేసి ఉంటే… అనే ప్రశ్న అనిల్ రావిపూడికి ఎదురైంది. ఆయన ఈ విధంగా స్పందించారు.

    పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటే అదొక కొత్త అనుభూతి అయ్యుండేది. ఖచ్చితంగా మంచి చిత్రం అయ్యేది. కానీ కళ్యాణ్ రామ్ గారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా ఇచ్చిన మాట ప్రకారం నాతో పటాస్ మూవీ చేశారు. పటాస్ లేకుంటే సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి చిత్రాలు చేసే అవకాశం నాకు వచ్చి ఉండేది కాదు. అందుకే కళ్యాణ్ రామ్ కి రుణపడి ఉంటాను… అని అనిల్ రావిపూడి అన్నారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.