Yash Dayal controversy : ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరఫున ఆడిన యువ బౌలర్ యష్ దయాళ్ పై ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. అతనిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతీ ఇటీవల తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడని ఆ యువతి చెప్పుకొచ్చింది. ఆ యువతి యష్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. అతడి కుటుంబ సభ్యులు రంగంలోకి వచ్చారు. ఆ యువతిపై లేనిపోని ఆరోపణలు చేశారు.
యష్ కుటుంబ సభ్యులు స్పందించిన తర్వాత ఆ యువతి మరోసారి తెర మీదకి వచ్చింది..” ప్రేమ పేరుతో నాకు దగ్గరయ్యాడు..పెళ్ళి ఎత్తగానే దూరం పెట్టాడు. నన్ను మోసం చేశాడు. ఆయినప్పటికీ నేను అతని గురించి పట్టించుకోను. ఎందుకంటే దేవుడే అతడికి సరైన బుద్ధి చెబుతాడని అనుకుంటాను. నా గురించి అతని కుటుంబం చాలా దారుణంగా మాట్లాడింది. నా సెల్ఫ్ రెస్పెక్ట్ ను దెబ్బతీసింది. నేను న్యాయపోరాటానికి దిగాను. గడచిన నాలుగున్నర సంవత్సరాలలో అతడు మరో ముగ్గురితో రిలేషన్ కొనసాగించాడు.. అందులో ఒక యువతి తో నేను మాట్లాడాను. కీలకమైన ఆధారాలు సేకరించాను.. ఇక అతడి సంగతి న్యాయస్థానంలో తేల్చుకుంటానని” ఆ యువతి పేర్కొంది. యష్ గురించి రోజుకో తీరుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆ యువతి కీలక ఆధారాల సేకరించిన తర్వాతే న్యాయపోరాటానికి దిగినట్టు తెలుస్తోంది.
స్థానం లభిస్తుందా?
యష్ గతంలో గుజరాత్ జట్టుకు ఆడేవాడు. ఇప్పుడు బెంగళూరు జట్టుకు వచ్చేశాడు. ఇటీవల ఐపీఎల్లో పర్వాలేదనిపించాడు. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు వెలుగు చూడటం ఒక్కసారిగా చర్చకు దారితీస్తోంది. మరోవైపు అతడు ఈ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వచ్చే ఐపీఎల్లో బెంగళూరు జట్టులో కొనసాగుతాడా? జట్టు మేనేజ్మెంట్ అతడిని ఉంచుకుంటుందా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఎందుకంటే బెంగళూరు జట్టు ఇటీవల కర్ణాటక రాజధాని లో తొక్కిసలాటకు కారణమైందని ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఇప్పటికే ఆ జట్టులో అనేక లోపాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి జట్టులో కొనసాగిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. యూపీ యువతి న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో అతడికి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.
ఒకవేళ ఆ యువతి చేస్తున్న న్యాయపోరాటంలో యష్ వ్యవహారాలు బయటికి వస్తే అతడిని కచ్చితంగా జట్టు నుంచి తొలగిస్తారని తెలుస్తోంది.. అయితే యష్ కుటుంబ సభ్యులు మాత్రం ఆ యువతిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆమె లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడుతున్నారు. తమ కుమారుడు క్రికెట్లో ఎదుగుతున్న తీరు చూడలేక ఇటువంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొంటున్నారు. “ఆమె చెబుతున్నవన్నీ అబద్ధాలు. ఆమె అడిగిన డబ్బులు మేము ఇవ్వలేదు కాబట్టి ఇలా చేస్తోంది. మా కుమారుడి ఎదుగుదల చూడలేక ఇలా చేస్తోంది. ఆమె న్యాయపోరాటానికి దిగితే.. మేము కూడా మా స్థాయిలో చూసుకుంటామని” యష్ తల్లిదండ్రులు చెబుతున్నారు.