https://oktelugu.com/

Ind Vs Aus 4th Test: నెంబర్ వన్ నుంచి.. మూడో స్థానానికి.. టీమిండియా కు ఎందుకు ఈ దుస్థితి?

ఈ ఏడాది జనవరిలో మనదేశంలో ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లాండ్ వచ్చింది. హైదరాబాదులో జరిగిన టెస్టులో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత మిగిలిన నాలుగు టెస్టులలో విజయ దుందుభి మోగించింది. బజ్ బాల్ గేమ్ తో టెస్ట్ క్రికెట్లో సరికొత్త సంచలనం సృష్టించిన ఇంగ్లాండ్ కు.. బలమైన గుణపాఠం చెప్పింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో 2-0 తేడాతో వైట్ వాష్ చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 30, 2024 / 01:06 PM IST

    Ind Vs Aus 4th Test

    Follow us on

    Ind Vs Aus 4th Test: ఇలా వరుస విజయాలు సాధించి టీమిండియా టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది.. కానీ ఎప్పుడైతే న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో వరుసగా మూడు టెస్టులలో ఓడిపోయిందో.. అప్పుడే టీమిండియా కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురి కావడంతో.. టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా రెండవ స్థానానికి పడిపోయింది. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలోకి వచ్చింది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా పెర్త్ లో 295 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో టీం ఇండియాకు బుమ్రా సారధ్యం వహించాడు. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అయితే ఆస్ట్రేలియాను 104 పరుగులకే కుప్ప కూల్చింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో 487/6(డిక్లేర్) పరుగులు చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియాను 238 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మళ్ళీ టెస్ట్ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అయితే ఈ దశలో టీమిండియాలో రోహిత్ చేరాడు. ఆ తర్వాత ఆడిలైట్ టెస్ట్ లో భారత్ పెర్త్ ఊపును కొనసాగించలేకపోయింది. 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్రిస్బేన్ టెస్టులో వర్షం గనుక కురువక పోయి ఉంటే టీమిండియా కచ్చితంగా ఓడిపోయేది. ఇక మెల్ బోర్న్ మైదానంలోనూ ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను నిలువరించడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. బుమ్రా కు సహకరించేవారు లేక ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా ఆడుతుంటే చూస్తుండి పోయారు. అటు బ్యాటింగ్ లోనూ నితీష్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్ మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే ఆస్ట్రేలియా విధించిన 340 రన్స్ టార్గెట్ ను చేదించలేక చేతులెత్తేశారు. రెండవ ఇన్నింగ్స్ లోనూ యశస్వి జైస్వాల్ 84 పరుగులు చేయకుండా ఉండి ఉంటే.. టీమిండియా మరింత దారుణంగా ఓటమిపాలయ్యేది.

    ఎందుకిలా

    ఒకప్పుడు రెడ్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా తోపు. అందులో డౌటే లేదు. కానీ ఇప్పుడు రెడ్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా ఎదురీదుతోంది. సమర్థవంతమైన ఆట తీరు ప్రదర్శించలేక చేతులెత్తేస్తోంది. కీలక ఆటగాళ్లు రోహిత్, విరాట్, రాహుల్ వంటి వాళ్లు వరుసగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా రోహిత్ అయితే అత్యంత చెత్త ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. విరాట్ కోహ్లీ చెప్పుకోవడానికి ఒక సెంచరీ ఈ సిరీస్లో చేశాడు. రాహుల్ 50 + స్కోర్ నమోదు చేశాడు. రోహిత్ మాత్రం పది పరుగులకు మించి చేయలేకపోతున్నాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు.. ఒకప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు భారత జట్టును తీసుకెళ్లిన అతడు ఇలా విఫల ఆటగాడిగా మారిపోవడాన్ని సగటు భారత అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్ కు అలవాటు పడిన ఆటగాళ్లు.. రెడ్ బాల్ ఫార్మాట్ లో రాణించలేకపోతున్నారని.. అందువల్లే టీమిండియా ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.