Aha OTT Team : ఈ మధ్యకాలంలో చాలా ఓటిటీ ప్లాట్ ఫామ్ లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ ఆహా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఓటిటీ ప్లాట్ ఫామ్ 100% తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్. ప్రస్తుతం ఆహా ఓటిటీ ఆహా గోల్డ్ తో కలిసి 4కే క్వాలిటీ వీడియో కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తుంది. క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ మరియు డాల్బీ సౌండ్ తో థియేటర్ ఎక్స్పీరియన్స్ ను మన ముందుకు తీసుకు వచ్చింది ఆహా ఓటిటీ ప్లాట్ ఫామ్. తాజాగా ఆహా ఓటిటీ టీం డిసెంబర్ 31 లోపు ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ యాన్యువల్ ప్యాక్ తీసుకున్న ఎన్నారైలకు బాలయ్యతో కలిసే అవకాశం తో పాటు ఈ ఈవెంట్లో విఐపి లాంచ్ లో సీటు దక్కే అవకాశం కూడా ఉందని అధికారింగా ప్రకటించడం జరిగింది. క్యాచ్ అండ్ క్లిక్ విత్ డ్రాకు మహారాజ్ అంటూ ఈ బంపర్ ఆఫర్ ను ఎక్స్ క్లూజివ్ గా యూఎస్ లో ఉన్న తెలుగు వాళ్ళ కోసం ఆహా ఓటిటీ న్యూ ఇయర్ కానుకగా అందించనుంది. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులలో ఈ షోకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటివరకు అన్ స్టాపబుల్ షో మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఈ షోలో చాలామంది సెలబ్రెటీలు పాల్గొని బాలయ్యతో ముచ్చటించారు. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 4 జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇక తాజాగా ఈ షోలో బాలయ్యతో కలిసి ఒకే వేదిక మీద ముచ్చటించటానికి వెంకటేష్ పాల్గొన్నారు. బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు వెంకటేష్ ఇచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా మారాయి.సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ ఈ షోలో పాల్గొన్నారు. ఈ సినిమా విశేషాలతో పాటు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా వెంకటేష్ ఈ షోలో చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక గతంలో వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 మరియు f3 సినిమాలలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక బాలకృష్ణ సినిమా విషయాలకు వస్తే బాలయ్య రవీంద్ర దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలకృష్ణ బోయపాటి శ్రీను దసకత్వంలో అఖండ 2 సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక బాలయ్య నటించిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.