https://oktelugu.com/

Wtc Final: టీమిండియా ఓటమికి కారణమదే!

ఇన్నాళ్లూ సూపర్ గా ఆడి చివరిదైన కీలకమైన ఫైనల్ లో టీమిండియా చేతులెత్తేసింది. అరవీర భయంకర ఆస్ట్రేలియాను, బలమైన ఇంగ్లండ్ ను చిత్తు చేసిన భారత్ చివరకు న్యూజిలాండ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ టైటిల్ ను కోల్పోయింది. చరిత్రలోనే తొలిసారి జరిగిన ఈ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ టైటిల్ ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. 8 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. దారుణ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 24, 2021 / 08:35 AM IST
    Follow us on

    ఇన్నాళ్లూ సూపర్ గా ఆడి చివరిదైన కీలకమైన ఫైనల్ లో టీమిండియా చేతులెత్తేసింది. అరవీర భయంకర ఆస్ట్రేలియాను, బలమైన ఇంగ్లండ్ ను చిత్తు చేసిన భారత్ చివరకు న్యూజిలాండ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ టైటిల్ ను కోల్పోయింది.

    చరిత్రలోనే తొలిసారి జరిగిన ఈ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ టైటిల్ ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. 8 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది.

    దారుణ బ్యాటింగ్, వర్షం అంతరాయంతో పడుతూ లేస్తూ సాగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పేసర్లకు టీమిండియా దాసోహమైంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఇప్పుడు టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ ఓటమికి ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యం, ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవడం.. ఫుల్ టైం బ్యాట్స్ మెన్ హనుమ విహారిని పక్కనపెట్టడం కూడా టీమిండియా ఓటమికి దారితీసింది.

    ఓటమికి గల కారణాలపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ సైతం నోరువిప్పాడు. పేలవ బ్యాటింగ్, వర్షం అంతరాయంతో పాటు తమ ప్రణాళికలు బెడిసికొట్టడంతోనే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ విజయం సాధించలేకపోయిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రత్యర్థి న్యూజిలాండ్ బాగా ఆడిందని.. తమ తప్పిదాలను అంగీకరించాడు.

    మరో 30-40 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. పేస్ అల్ రౌండర్ విలువ ఏంటో తెలిసి వచ్చిందని.. తమకు న్యూజిలాండ్ కు పేస్ అల్ రౌండర్ లోటుయే ప్రధాన తేడా అని విరాట్ కోహ్లీ తెలిపాడు.

    వర్షం బ్యాడ్ లైట్ వల్ల ఆట ఆపేయాల్సి వచ్చిందని.. ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరిగి ఉంటే మేం మరిన్ని పరుగులు చేసే వాళ్లమేమోనని విరాట్ కోహ్లీ తెలిపాడు.