WTC Final Rain Threat : ప్రోటీస్ జట్టుకు ఇది తొలి తుది పోరు. మొత్తంగా ఫైనల్ మ్యాచ్లో భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. అయితే జూన్ 11న ఫైనల్ మ్యాచ్ మొదలవుతుంది. మరుసటి రోజు మ్యాచ్ నిర్వహించేది కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మ్యాచ్ నిర్వహించే ప్రాంతంలో శుక్రవారం వర్షం కొరవడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ వర్షం వల్ల ఫలితం ఆగిపోతే.. తేలే అవకాశం లేకపోతే టైటిల్ రెండు జట్లు సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ప్లేయర్ల ప్రదర్శన, వాతావరణం కూడా ఫలితం పై ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది. 1998లో ప్రోటీస్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు ఐసీసీ నిర్వహించిన ఏ మేజర్ టోర్నీలో కూడా విజయం సాధించకపోవడం విశేషం. అంటే దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఐసీసీ నిర్వహించే మేజర్ ట్రోఫీ గెలుచుకునే అవకాశం ప్రోటీస్ జట్టుకు లభించింది. పొట్టి విశ్వ సమరంలో తుది పోరు దాకా వెళ్ళినప్పటికీ.. రోహిత్ సేన ఎదుట ప్రోటీస్ జట్టు తలవంచక తప్పలేదు.
Also Read : వాళ్లకు చోటు.. WTC ఫైనల్ లో దక్షిణాఫ్రికా తో తలపడే ఆస్ట్రేలియా జట్టు ఇదే..
అయితే హై వోల్టేజ్ ఫైనల్ నేపథ్యంలో వాతావరణం శుక్రవారం నుంచి ప్లేయర్లకు చుక్కలు చూపిస్తుందని తెలుస్తోంది. శుక్రవారం నాడు ఈ ప్రాంతంలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు ముందుగానే మ్యాచ్ కోసం రిజర్వ్ డే ను ప్రకటించారు. అయినప్పటికీ వర్షం తగ్గకపోతే.. మ్యాచ్ నిర్వహించే అవకాశం లేకపోతే..నిర్ణీత రోజులలో ఫలితం రాకపోతే.. మ్యాచ్ కచ్చితంగా డ్రా అవుతుంది. అప్పుడు రెండు జట్లు సమానంగా ట్రోఫీని పంచుకోవాల్సి ఉంటుంది. నగదు విషయంలో కూడా అదే సిద్ధాంతాన్ని పాటించాల్సి ఉంటుంది. ప్లేయర్ల పరంగా.. మిగతా విషయాలపరంగా కంగారు జట్టు కాస్త బలంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రోటీస్ తక్కువ అంచనా వేయడానికి వెళ్ళలేదు. ఫైనల్ మ్యాచ్ జరిగే ఇదే వేదిక మీద గతంలో ప్రోటీస్ జట్టు బౌలర్లు దుమ్ము రేపారు. ముఖ్యంగా ఇంగ్లీష్ జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఇప్పుడు కంగారు జట్టుతో జరిగే తుది పోరులో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని ప్రోటీస్ జట్టు ప్లేయర్లు భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే భారీగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో కంగారు జట్టుతో సరితూగే ప్లేయర్లకు తుది జట్టులో స్థానం కల్పించారు. ఒకవేళ వర్షం గనుక అడ్డంకి సృష్టించకపోతే.. అల్టిమేట్ టెస్టులో.. రెండు జట్లు టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ చేసే అవకాశం లేకపోలేదు.