AP Annadata Sukhibhava 2025: ఈ జాబితాలో పేరు ఉన్న రైతులకు మాత్రమే వారి ఖాతాలో రూ.7000 రూపాయలు జమ కానున్నాయి. తాజాగా ప్రభుత్వం రైతులకు ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. రైతులందరి ఖాతాలలో ప్రభుత్వం డబ్బులు జమ చేసేందుకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ప్రాథమికంగా ప్రభుత్వం ఒక జాబితాను విడుదల చేసింది. అయితే ఈ లిస్టులో పేరు ఉన్న అన్నదాతలకు మాత్రమే వాళ్ల ఖాతాలలో డబ్బులు లభించే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబితాలో తమ పేరు ఉందో లేదో వాళ్ళు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. రైతులందరికీ కూడా ప్రధానమంత్రి కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించిన ప్రాథమిక జాబితాను ప్రభుత్వం రూపొందించింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తాజాగా 3,19,338 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. కానీ ఇది ఫైనల్ లిస్ట్ ఏమీ కాదు.
తుది స్థాయిలో ఈ సంఖ్య మారే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా జాబితా పరిశీలన కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. తుది జాబితా రిలీజ్ అయిన తర్వాత రైతులందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. వాళ్లందరూ ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత వాళ్ళందరి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. అయితే ఈ మధ్యకాలంలో అర్హత కలిగిన రైతులను గుర్తించేందుకు వెబ్ ల్యాండ్ డేటా ఆధారంగా గ్రామస్థాయిలో పరిశీలన చేపట్టడం జరిగింది. దీంట్లో గ్రామ వ్యవసాయ సహాయకులు అలాగే రైతు సేవ కేంద్రాలలో అందుబాటులో ఉన్న అన్ని డాక్యుమెంట్ల ఆధారంగా మొత్తంగా 3,19,666 మంది రైతులను ఈ పథకానికి అర్హులుగా ప్రాథమికంగా ఎంపిక చేయడం జరిగింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వము అర్హులైన రైతులందరికీ కూడా పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి వారి ఖాతాలలో రూ.20వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను భాగంగా ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ప్రక్రియ కొనసాగిస్తుంది.