https://oktelugu.com/

Yuzvendra Chahal: భుజాలపై ఎత్తుకొని తిప్పింది.. క్రికెటర్ ఒళ్ళు భూ చక్రంలా తిరిగింది.. వైరల్ వీడియో

సంగీత ఫొగాట్(Sangeeta Phogat).. భారత రెజ్లర్. భారత జట్టు తరఫున పలు టోర్నీలలో పాల్గొని ప్రతిభ చాటింది. ప్రస్తుతం ఈమె ఓ పాపులర్ హిందీ ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న డాన్స్ షో 'జలక్ దిక్ లాజా" లో కంటెస్టెంట్ గా బరిలో ఉంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 3, 2024 / 04:21 PM IST

    Yuzvendra Chahal

    Follow us on

    Yuzvendra Chahal: అసలే అతడిది భక్కపలచని శరీరం.. అలాంటి వ్యక్తి ని ఆరడుగుల ఆజానుబాహురాలిగా ఉన్న ఆ యువతి అమాంతం ఎత్తుకుంది. రెండు చేతులతో అతడిని పట్టుకొని తిప్పింది. దీంతో అతడి ఒళ్ళు భూచక్రంలా తిరిగింది. ఆమె తిప్పే తిప్పుడుకి తట్టుకోలేక కిందికి దించు దించు అని ప్రాధేయపడ్డాడు. చివరికి అతడిని దించింది.. కొంతసేపటి దాకా అతడు అలాగే నిల్చుండి పోయాడు. అనంతరం తేరుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న క్రికెటర్.. అలా అతడిని తిప్పిన మహిళ ఎవరంటే..

    సంగీత ఫొగాట్(Sangeeta Phogat).. భారత రెజ్లర్. భారత జట్టు తరఫున పలు టోర్నీలలో పాల్గొని ప్రతిభ చాటింది. ప్రస్తుతం ఈమె ఓ పాపులర్ హిందీ ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న డాన్స్ షో ‘జలక్ దిక్ లాజా” లో కంటెస్టెంట్ గా బరిలో ఉంది.. మరోవైపు టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహాల్ సతీమణి, కొరియోగ్రాఫర్ ధన శ్రీ వర్మ కూడా ఓ కంటెస్టెంట్ గా పోటీలో ఉంది. సంగీత ముందే ఎలిమినేట్ అయింది. ధన శ్రీ వర్మ టాప్ 5 లో ఉంది. అయితే ఈ షో కు సంబంధించి ఇటీవల ఫైనల్ సంబరాలు నిర్వహించారు. ఈ క్రమంలో యజువేంద్ర చాహల్ ను సంగీత అమాంతం భుజాలపైకి ఎత్తుకొని గాల్లోకి తిప్పింది. దీంతో తనను కిందికి దించాలని అతడు ఆమెను బతిమిలాడాడు. అయినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. కొంత సేపు తిప్పిన తర్వాత చాహల్ ను కిందికి దించాడు. అతడు బతికి పోయాను అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు.
    దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ఈ షోలో ధన శ్రీ వర్మ ఫైనల్ చేరింది.. తన సతీమణి ధన శ్రీ కి మద్దతు గా ఓటింగ్ రాబట్టేందుకు చాహల్ బరిలోకి దిగాడు. తన సహచర ఆటగాళ్ళ తో ఓట్లు వేయించాడు. వారి ద్వారా ప్రేక్షకులను ఓటు వేయాలని రిక్వెస్ట్ చేయించాడు. అయినప్పటికీ ఆమె ధన శ్రీ టాప్ 5 లో నిలిచింది.

    కాగా, చాహల్ ఇటీవలి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ 2024 సీజన్ కు రెడీ అవుతున్నాడు. సంగీత భారత రెజ్లింగ్ క్రీడా కారిణిగా సుపరిచితురాలు. ప్రస్తుతం సంగీత యజువేంద్ర చాహల్ ను భుజాల పైకి ఎత్తుకుని తిప్పిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. “ఆడవాళ్ల జోలికి రాకుండా యజువేంద్ర చాహల్ ను సంగీత భలే తిప్పింది. దెబ్బకి అతడి కళ్ళు తిరిగాయని” నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.