WPL 2025 Auction Highlights: భారత జట్టులో అనామక ( అన్ క్యాప్డ్) మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్ మినీ వేలంలో అదరగొట్టింది. నక్కతోక తొక్కినట్టుగా అత్యధిక ధర సొంతం చేసుకుంది. సిమ్రాన్ ను గుజరాత్ జట్టు కొనుగోలు చేసింది. ఏకంగా 1.90 కోట్లను ఆమెకు చెల్లించింది. ఆమె వాస్తవ ధర 10 లక్షలు కాగా.. తమ జట్టులోకి తీసుకోవడానికి ఢిల్లీ, గుజరాత్ యాజమాన్యాలు తీవ్రంగా ప్రయత్నించాయి. చివరికి గుజరాత్ యాజమాన్యానికి ఆ అదృష్టం దక్కింది. వెస్టిండీస్ చెట్లు కీలకమైన ఆల్ రౌండర్ గా ఉన్న డియాండ్రా డాటిన్ 50 లక్షల కనీస ధరతో ఆమె వేలంలోకి వచ్చింది. ఆమె కోసం గుజరాత్, ఉత్తరప్రదేశ్ జట్ల యాజమాన్యాలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డాయి. చివరికి గుజరాత్ యాజమాన్యం ఆమెను 1.70 కోట్లకు దక్కించుకుంది. టీమిండియాలో కీలకమైన వికెట్ కీపర్ గా కొనసాగుతున్న 16 సంవత్సరాల కమలిని ని ముంబై జట్టు కొనుగోలు చేసింది. ఆమె కోసం ఏకంగా 1.60 కోట్లు చెల్లించింది. మరో కీలకమైన ప్లేయర్ ప్రేమ రావత్ ను బెంగళూరు జట్టు వన్ పాయింట్ 1.20 కోట్లకు దక్కించుకుంది.
వేలంలో అత్యధిక ధర దక్కింది ఈ ప్లేయర్లకే.
సిమ్రాన్ షేక్.. గుజరాత్ జట్టు ఈమెను 1.90 కోట్లకు కొనుగోలు చేసింది.
డియాండ్రా డాటిన్.. ఈ విండీస్ ప్లేయర్ ను గుజరాత్ జట్టు 1.70 కోట్లకు కొనుగోలు చేసింది.
కమలిని.. ఈమెను 1.60 కోట్లకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది.
ప్రేమ రావత్.. ఈమెను 1.20 కోట్లకు బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.
చరణి.. ఈమెను ఢిల్లీ జట్టు 55 లక్షలకు కొనుగోలు చేసింది.
నాడిన్ డి క్లర్క్.. ఈమెను ముంబై జట్టు 30 లక్షలకు కొనుగోలు చేసింది.
డేనియల్ గిబ్సన్.. ఈమెను 30 లక్షలకు గుజరాత్ కొనుగోలు చేసింది.
అలనా కింగ్.. ఈమెను 30 లక్షలకు ఉత్తరప్రదేశ్ జట్టు కొనుగోలు చేసింది.
అక్షిత.. ఈమెను 20 లక్షలకు ముంబై జట్టు కొనుగోలు చేసింది.
నందిని.. ఈమెను ఢిల్లీ జట్టు 10 లక్షలకు కొనుగోలు చేసింది.
సారా .. ఈమెను పదిలక్షలకు ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది.
జోషిత.. ఈమెను బెంగళూరు 10 లక్షలకు కొనుగోలు చేసింది.
సంస్కృతి.. ఈమెను ముంబై జట్టు పది లక్షలకు కొనుగోలు చేసింది.
క్రాంతి గౌడ్.. ఈమెను ఉత్తరప్రదేశ్ జట్టు పది లక్షలకు కొనుగోలు చేసింది.
అరుషి గోయల్.. ఏమను 10 లక్షలకు ఉత్తరప్రదేశ్ జట్టు కొనుగోలు చేసింది.
ప్రకాశికా నాయక్.. ఈమెను 10 లక్షలకు గుజరాత్ జట్టు కొనుగోలు చేసింది.
నికి ప్రసాద్.. ఈమెను పదిలక్షలకు ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది.
జాగ్రవి పవార్.. ఈమెను పదిలక్షలకు బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.
రాఘవి.. ఈమెను 10 లక్షలకు బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.
అమ్ముడుపోని ప్లేయర్లు వీళ్లే
కిమ్ గార్త్, సారా గ్లెన్, లారెన్ బెల్, లిజల్ లీ, హీథర్ నైట్ వంటి విదేశీ ప్లేయర్లు అమ్ముడుపోలేదు.. పూనమ్ యాదవ్, సుష్మ వర్మ, స్నేహ్ రాణా, సుష్మా వర్మ వంటి స్వదేశీ ప్లేయర్లను ఏ జట్టు యాజమాన్యం కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Wpl 2025 auction highlights simran shaikhs costliest buy 16 year old g kamalini bags rs 1 6 crore
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com