Shreyanka Patil: ఫైనల్ లో ఢిల్లీ ఘోరంగా ఓడింది ఈమె వల్లే.. ఇదీ ఆర్సీబీ క్వీన్ నేపథ్యం.

ఆదివారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ జట్టుపై జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు ఎనిమిది టికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సంవత్సరాల నిరీక్షణకు స్మృతి సేన తెరదించింది. దర్జాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ ఒడిసి పట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 18, 2024 5:39 pm

Shreyanka Patil

Follow us on

Shreyanka Patil: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ గెలిచిన బెంగళూరు జట్టు పై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ జట్టులోని క్రీడాకారిణులను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో మెరిసిన ఓ 21 సంవత్సరాల యువతిని కొనియాడుతున్నారు. ఇంతకీ ఎవరు ఆ యువతి? ఏమిటి ఆమె నేపథ్యం? దీనిపై ప్రత్యేక కథనం

ఆదివారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ జట్టుపై జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు ఎనిమిది టికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సంవత్సరాల నిరీక్షణకు స్మృతి సేన తెరదించింది. దర్జాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ ఒడిసి పట్టింది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్లో శ్రేయాంక పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ టాప్ ఆర్డర్ పేక మేడ లాగా కుప్పకూలిపోవడంలో శ్రేయాంకది కీలక పాత్ర. ఏకంగా ఢిల్లీ జట్టులో నాలుగు కీలక వికెట్లను శ్రేయాంక పడగొట్టింది. దీంతో ఢిల్లీ జట్టు 113 పరుగులకే ఆల్ అవుట్ అయింది. కాగా, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో శ్రేయాంక 8 మ్యాచ్లు ఆడింది. 13 వికెట్లు పడగొట్టింది. పర్పుల్ క్యాప్ సొంతం చేసుకుంది. దీంతోపాటు ఐదు లక్షల నగదును కూడా నిర్వాహక ద్వారా పొందింది.

శ్రేయాంక స్వస్థలం బెంగళూరు. ఈమె వయసు 21 సంవత్సరాలు. దేశవాళి క్రికెట్లో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశవాళి క్రికెట్లో ప్రతిభ చూపడంతో సెలక్టర్లు జాతీయ టీమ్ కు ఎంపిక చేశారు. ఇప్పటివరకు భారతదేశ తరఫున రెండు వన్డేలు, 6 t20 మ్యాచ్ లు ఆడింది. వరుసగా 4, 8 వికెట్లు పడగొట్టింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023 వేలంలో బెంగళూరు జట్టు ఈమెను 10 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు ముందు ఆమెను బెంగుళూరు జట్టు రిటైన్ చేసుకుంది. శ్రేయాంక మహిళల కరేబియన్ ప్రీమియర్ లీగ్ లోనూ ఆడుతోంది. ఆమె గయానా అమెజాన్ వారియర్స్ జట్టుకు ఆడుతోంది.