WPL 2024: బెంగళూరు విక్టరీ.. కోహ్లీ భాయ్ కి సూటిగా తగిలే వీడియో ఇది

బెంగళూరు జట్టు విజయం సాధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.. అందులో ఒక వీడియో విరాట్ కోహ్లీ భాయ్ కి సూటిగా తగిలేలా ఉందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 18, 2024 2:38 pm

WPL 2024

Follow us on

WPL 2024: ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు.. women’s premier league లో బెంగళూరు జట్టు విజయం విరాట్ కోహ్లీని ఇబ్బంది పెడుతోంది. ఢిల్లీ జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో స్మృతి మందాన ఆధ్వర్యంలోని బెంగళూరు టీం 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గత ఏడాది వినిపించిన విమర్శలకు చెక్ పెడుతూ సరికొత్త విజేతగా ఆవిర్భవించింది. Women’s premier league cup సగర్వంగా ఒడిసి పట్టుకుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అదే సమయంలో పురుషుల జట్టుకు సవాళ్లు ఎదురవుతున్నాయి.

బెంగళూరు జట్టు విజయం సాధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.. అందులో ఒక వీడియో విరాట్ కోహ్లీ భాయ్ కి సూటిగా తగిలేలా ఉందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. ఓ వ్యక్తి గ్యాస్ సిలిండర్ ను మోయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఇదే సమయంలో అతడి భార్య అక్కడికి వస్తుంది. తన భర్త పడుతున్న కష్టాన్ని చూడలేక వెంటనే ఆ గ్యాస్ సిలిండర్ ను అమాంతం ఎత్తుకుంటుంది. సంకలో పెట్టుకొని కిందికి వెళుతుంది. ఇందులో గ్యాస్ సిలిండర్ ను మోసేందుకు ఇబ్బంది పడుతున్న వ్యక్తిని వీడియో క్రియేటర్స్ కోహ్లీగా.. ఆ చంకలో గ్యాస్ సిలిండర్ పెట్టుకున్న మహిళను స్మృతి మందానగా రూపొందించారు. హెలేరియస్ గా ఉన్న ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది.

ఈ వీడియోని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “స్మృతి టీం కప్ గెలిచింది. వీడియో క్రియేటర్లు ఆగడం లేదు. వారి నైపుణ్యానికి పదును పెడుతున్నారు. అందులో భాగంగానే ఇలాంటి వీడియో రూపొందించారు. ఈ వీడియోలో ఏకంగా విరాట్ కోహ్లీని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు ఈ వీడియో సూటిగా తగులుతోంది. మరి దీనిపై విరాట్ కోహ్లీ ఎలా స్పందిస్తాడో” అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. బెంగళూరు విజయం సాధించిన అనంతరం ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. స్మృతి సేన కప్ సాధించిన నేపథ్యంలో.. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 17వ సీజన్ లో విరాట్ కోహ్లీ పై భారం తీవ్రంగానే ఉంటుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.