World Test Rankings : దక్షిణాఫ్రికా నిర్ణయంతో భారత ర్యాంకుకు ఎసరు?

అయితే బిజీ షెడ్యూల్‌ కారణంగానే ఇలా చేశామని బోర్డు తెలిపింది. అయితే సౌతాఫ్రికా నిర్ణయం టీమిండియా ర్యాంక్స్‌పై ప్రభావం చూపుతోంది.

Written By: NARESH, Updated On : February 7, 2024 4:51 pm
Follow us on

World Test Rankings : వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023–25(డబ్ల్యూటీసీ) ఆసక్తికరంగా సాగుతోంది. గతానికి భిన్నంగా ఈసారి టాప్‌ – 2 కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా దక్షిణాఫ్రికా తీసుకున్న నిర్ణయం టీమిండియా ర్యాంకుకు ఎసరు తెచ్చింది. ఇంగ్లండ్‌తో వైజాగ్‌లో జరిగిన రెండో టెస్ట్‌ విజయంతో భారత్‌ డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. రెండు రోజులకే మళ్లీ మూడో స్థానానికి పడిపోయింది.

ఏం జరిగిందంటే..
దక్షిణాఫ్రికాలో ఆదేశ జట్టు న్యూజిలాండ్‌తో తలపడుతోంది. తొలి టెస్టులో న్యూజిలాండ్‌ 281 రుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇందులో దక్షిణాఫ్రికా లక్ష్యం 529 పరుగుల. భారీ టార్గెట్‌తో సెకండ్‌ ఇన్సింగ్స్‌ ప్రారంభించిన సౌత్‌ ఆఫ్రికా 247 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో న్యూజిలాండ్‌ డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌ టేబుల్‌లో టాప్‌కు చేరింది.

ర్యాంకింగ్స్‌ ఇలా..
ప్రస్తుత ఛాంపియన్‌షిప్‌లో మూడు టెస్టులు ఆడిన న్యూజిలాండ్‌ రెండింటిలో విజయం సాధించింది. 66.6 శాతం గెలుపుతో, 24 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా జట్టు 55 శాతం గెలుపు, 66 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, భారత్‌ 52 శాతం గెలుపు, 38 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లకు కీలక ఆటగాళ్లను సౌత్‌ ఆఫ్రికా పక్కన పెట్టింది. దీంతో ఆ దేశ క్రికెట్‌ బోర్డుపై విమర్శలు వచ్చాయి. అందుకే న్యూజిలాండ్‌ గెలుస్తుందని పలువురు ఆరోపించారు. అయితే బిజీ షెడ్యూల్‌ కారణంగానే ఇలా చేశామని బోర్డు తెలిపింది. అయితే సౌతాఫ్రికా నిర్ణయం టీమిండియా ర్యాంక్స్‌పై ప్రభావం చూపుతోంది.

మూడో టెస్టు కూడా గెలిస్తే..
ఫిబ్రవరి 13 నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ మధ్య మూడో టెస్టు జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో కూడా కివీస్‌ గెలిస్తే గెలపు శాతం 75కు పెరుగుతుంది. దీని ప్రభావం టీమిండియాతోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌పైనా పడుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండియా, బంగ్లాదేశ్‌(50 %; 12 పాయింట్లు), పాకిస్తాన్‌(36.66 %; 22 పాయింట్లు) టాప్‌–5లో ఉన్నాయి.