Paytm Payments Bank : షాకింగ్ న్యూస్ : పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు? అమలు ఎప్పటి నుంచంటే..

దీనిపై పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు రెస్పాన్స్‌ ఆధారంగా లైసెన్స్‌ రద్దు ఉంటుందని తెలుస్తోంది. బ్యాంకు నుంచి సరైన రెస్పాన్స్‌ లేకుంటే మార్చి 15 నుంచి లైసెన్స్‌ రద్దు చేస్తారని సమాచారం.

Written By: NARESH, Updated On : February 7, 2024 4:23 pm

paytm problems

Follow us on

Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కేంద్ర బడ్జెట్‌కు ఒక్క రోజు ముందు అంటే జనవని 31న రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుకు పెద్ద షాక్‌ ఇచ్చింది. డిపాజిట్లు సేకరించకుండా, వాలెట్స్, ఫాస్టాగ్స్‌ టాప్‌ అప్‌ చేయకుండా నిషేధం విధించింది. ఫిబ్రవరి 29 నుంచి ఇది అమలవుతుందని తెలిపింది. దీంతో పేటీఎం వినియోగదారులు ఆందోళన చెందతున్నారు. ఈ తరుణంలో త్వరలో మరో కఠిన నిర్ణయం తీసుకోవడం ఖాయం అంటున్నారు. మరోవైపు షేర్‌ మార్కెట్‌లో దీని షేర్లు వేగంగా పతనమవుతున్నాయి. ఈరెండింటి మాతృ సంస్థ వన్‌ 97 షేర్లు కూడా పతనమవుతున్నాయి.
బ్యాంకుపై చర్యలతో వార్షిక కార్యకలాపాలు ఆదాయం రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు పడిపోయే ప్రమాదం ఉందని పేటీఎం ఫౌండర్, సీఈవో విజయ్‌శేఖర్‌శర్మ తెలిపారు. ఈయరకు బ్యాంకులో 51 శాతం వాటా ఉండగా, వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ సంస్థకు 49 శాతం వాటా ఉంది.

లైసెన్స్‌ క్యాన్సిల్‌..?
ఇదిలా ఉండగా రిజర్వే బ్యాంకు ఈ ఆంక్షలతోనే ఆగదని తెలుస్తోంది. పేమెంట్స్‌ బ్యాంకు లైసెన్స్‌ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫిబ్రవరి 29 వరకు ఛాన్స్‌ ఇచ్చింది. ఆలోగా కస్టమర్లు తమ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకుని సేఫ్‌గా ఉంటారు. ఆ తర్వాత మార్చి 1న బ్యాంకు లైసెన్స్‌ రద్దు చేస్తుందని విశ్వసనీయ సమాచారం. అప్పటి నుంచి కస్టమర్లు తమ వాలెట్స్‌ సహా సేవింగ్స్‌ అకౌంట్‌ యాక్సెస్‌ పొందలేరు.

మార్చి 15 నుంచి అమలు..
పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఆర్‌బీఐ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిందని సమాచారం. కస్టమర్‌ డాక్యుమెంటేషన్‌ నిబంధనలను కూడా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలుఉన్నాయి. కేవైసీ నిబంధనలను అస్సలు పాటించలేదని సమాచారం. ఆడిట్‌ కూడా సక్రమంగా జరుపడం లేదని ప్రచారం జరుగుతోంది. దీనిపై పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు రెస్పాన్స్‌ ఆధారంగా లైసెన్స్‌ రద్దు ఉంటుందని తెలుస్తోంది. బ్యాంకు నుంచి సరైన రెస్పాన్స్‌ లేకుంటే మార్చి 15 నుంచి లైసెన్స్‌ రద్దు చేస్తారని సమాచారం.