World Cup 2023: ఐదుసార్లు వరల్డ్ కప్ కొట్టిన ఆస్ట్రేలియా టీమ్ ఈసారి ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరు..?

వరల్డ్ కప్ లో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో ఇప్పటికీ ఐదు సార్లు కప్పు గెలిచి వాళ్ల సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్న ఆస్ట్రేలియా టీమ్ వరుస ఓటముల వెనక అసలు కారణం ఏంటి అనేది ఎవరికి అర్థ కావడం లేదు.

Written By: Gopi, Updated On : October 16, 2023 3:48 pm
Follow us on

World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి టీం కూడా వరుస విజయాలను అందుకుంటూ వరల్డ్ కప్ లో టాప్ పొజిషన్ కి వెళ్తుంటే ఇప్పటికి ఐదు సార్లు వరల్డ్ కప్పును గెలుచుకున్న ఆస్ట్రేలియన్ టీం మాత్రం ఒక్క విజయాన్ని నమోదు చేసుకోవడానికి నానా తంటాలు పడుతుంది.ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ లకి రెండు మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో నిలవడం జరిగింది. ఇది చూసిన చాలామంది ఆస్ట్రేలియా టీం ఏంటి ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది అంటూ ఆ టీమ్ మీద జాలి చూపిస్తూనే, నెగిటివ్ కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది.

వరల్డ్ కప్ లో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో ఇప్పటికీ ఐదు సార్లు కప్పు గెలిచి వాళ్ల సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్న ఆస్ట్రేలియా టీమ్ వరుస ఓటముల వెనక అసలు కారణం ఏంటి అనేది ఎవరికి అర్థ కావడం లేదు.ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో వాళ్ళు ఆడిన రెండు మ్యాచ్ లను కనక చూసుకుంటే ఆస్ట్రేలియాని వేదిస్తున్న ప్రధాన సమస్య మిడిలాడర్ ఆస్ట్రేలియా టీమ్ ఇంతకు ముందు లాగా భారీ స్కోర్ చేయడం లో ఫెయిల్ అవుతుంది. వాళ్ల ఓపెనర్లు అయిన డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ కొంతవరకు బాగానే ఆడినప్పటికి ఆ తర్వాత బ్యాటింగ్ కి వస్తున్న ప్లేయర్లు అందరూ వరసగా ఫెయిల్ అవుతున్నారు ఇక మాక్స్ వెల్ కూడా క్రితం లాగా బ్యాట్ తో అద్భుతాలు చేయడం లేదు. ఆయన ఈ రెండు మ్యాచ్ ల్లో కూడా ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా అడలేకపోయాడు. ఇక స్టోయినిస్ కూడా తన పరిధి మేరకు ఆడటం లేదు ఒక్కరూ కూడా ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోతే ఇక మ్యాచ్ లో స్కోర్ ఎలా సాధిస్తారు అంటూ ఆస్ట్రేలియా టీమ్ మీద విమర్శలు వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమం లో ఆస్ట్రేలియా మ్యాచ్ లు గెలవాలంటే ఎలా గెలుస్తుంది.

అలాగే బౌలర్లు కూడా పెద్దగా రానించలేకపోతున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోను అన్ని విభాగాల్లో ఫెయిల్ అవుతూ చాలా దారుణమైన పర్ఫామెన్స్ ను ఇస్తున్నారు. చిన్న టీమ్ లు అయిన ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్ లాంటి టీమ్ లు కూడా పాయింట్స్ టేబుల్ లో ఆస్ట్రేలియా కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నాయి….

ఇక ఇలాంటి క్రమం లో ఆస్ట్రేలియా టీమ్ మళ్లీ పుంజుకొని ఆడితే తప్ప వాళ్ళకి సెమీ ఫైనల్ కి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పటికే ఇండియా, న్యూజిలాండ్ , పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా లాంటి టీములు వరుసగా మ్యాచు లు గెలుస్తూ వరల్డ్ కప్ కొట్టడమే లక్ష్యం గా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో ఆస్ట్రేలియా సెమీస్ కి చేరడం 90% కష్టమే కాని ఇక మీదట ఆడే అన్ని మ్యాచ్ లు గెలుస్తూ రన్ రేట్ పెంచుకుంటూ పోతే మాత్రం వాళ్లు కూడా సెమీస్ కి వెళ్లే అవకాశం అయితే ఉంది…