Team India’s victory celebrations: పాకిస్తాన్ మ్యాచ్ కి ముందు చాలా కసరత్తులు చేసినా ఇండియన్ టీమ్ ప్లేయర్లు అందరూ కూడా పాకిస్థాన్ మీద భారీ విక్టరీని నమోదు చేసుకున్న తర్వాత ఆ రోజు నైట్ హోటల్ లో చాలా అహ్లాదకరంగా కనిపించడం జరిగింది. తర్వాత జరగబోయే మ్యాచ్ కి చాలా గ్యాప్ ఉండటంతో ఆరోజు రాత్రి మ్యాచ్ ముగిసిన వెంటనే ప్లేయర్స్ అందరూ కలిసి ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ చాలా ఫన్నీగా గడిపారు…
ఇక అందులో భాగంగానే పాకిస్థాన్ మీద సాధించిన విజయాన్ని పెద్ద కేక్ కోసి టీమ్ మెంబర్స్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నట్టు గా తెలుస్తుంది. అదే రోజు నైట్ బిసిసిఐ అందరికీ పార్టీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అక్కడున్న సిబ్బందికి కూడా ఈ పార్టీ లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇలా బీసీసీఐ మన ప్లేయర్లు సాధించిన విజయానికి గుర్తుగా వాళ్లు రిలాక్స్ అవ్వడం కోసం పార్టీ ఇచ్చినట్టు గా తెలుస్తుంది. అయితే ఇండియా టీం ఇప్పటివరకు ఆడింది మూడు మ్యాచ్ లు మాత్రమే,ఇంకా ఆరు మ్యాచులు బ్యాలెన్స్ ఉండగానే మన ప్లేయర్లు ఇలా సంబరాలు చేసుకోవడం కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, పాకిస్తాన్ లాంటి శత్రువు టీం ని ఓడించిన తర్వాత ప్లేయర్లని అప్రిషియేట్ చేస్తేనే వాళ్లు కూడా వాళ్ళు ఇంకా సాధించాల్సిన టార్గెట్ ఏంటో గుర్తు చేసుకుంటూ మిగతా మ్యాచ్ లు కూడా చాలా బాగా ఆడే అవకాశం ఉంది. విజయం సాధించినప్పుడు ఎంకరేజ్ చేస్తేనే వాళ్లకి కూడా మిగతా మ్యాచ్ లు బాగా ఆడి గెలవాలి అనే సంకల్పం పెరుగుతుందని బీసీసీఐ భావించి ఇలా పార్టీ అరేంజ్ చేసినట్టుగా మరికొందరు చెప్తున్నారు…
అయితే ఇండియా సెమీస్ కి వెళ్లాలంటే ఇంకొక నాలుగు మ్యాచ్ లు గెలవాల్సి ఉంటుంది. ఇప్పటికే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఇండియా టీమ్ నాలుగు మ్యాచు లు గెలవడం అంత పెద్ద కష్టమైతే కాదు. ఎందుకంటే మన టీం ఇప్పటికే ఈ వరల్డ్ కప్ లో అత్యంత పవర్ ఫుల్ టీమ్ గా కనిపిస్తుంది. ఇక ఈ క్రమంలో ఇండియన్ టీం ని ఓడించాలి అంటే కష్టమే… ఇక ఈ పార్టీలో ఒకరి మీద ఒకరు ఫుల్ గా జోకులు వేసుకుంటూ నవ్వుతూ కాలక్షేపం చేశారు అందులో భాగంగానే బెస్ట్ ఫిల్డర్ గా కే ఎల్ రాహుల్ అవార్డుని కూడా గెలుచుకున్నారు.
హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఇమామ్ ఉల్ హక్ ఇచ్చిన క్యాచ్ ని చాలా అద్భుతంగా పట్టినందుకు బెస్ట్ ఫిల్డర్ గా ఆయన అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ అవార్డ్ ని మన ఫీల్డింగ్ కోచ్ అయిన దిలీప్ బహుకరిస్తున్నరు.ఒక మ్యాచ్ లో ఎవరు బాగా ఫీల్డింగ్ చేస్తే వారికి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతకు ముందు జరిగిన మ్యాచులో శార్దుల్ ఠాకూర్ బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ గెలుచుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ మెడల్ ని తీసి కేఎల్ రాహుల్ కి ఇవ్వడం జరిగింది…ఇక నెక్స్ట్ మన ఇండియా టీం బంగ్లాదేశ్ తో ఒక భారీ మ్యాచ్ ఆడబోతూంది…
– !
From the dugout to the dressing room to the streets of Ahmedabad – Scenes post India’s win over Pakistan! #CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue
WATCH
— BCCI (@BCCI) October 15, 2023