New Zealand Vs Pakistan: పాకిస్థాన్ మీద న్యూజిలాండ్ ఘన విజయం… వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ టీమ్ ని ఢీ కొట్టడం కష్టమేనా..?

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ కి వచ్చిన పాకిస్తాన్ టీం కి మొదట్లోనే పెద్ద దెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఓపెనర్లు అయినా షఫీక్ అలాగే ఇమామ్ ఉల్ హక్ ఇద్దరు కూడా పెద్దగా స్కోర్లు ఏమి చేయకుండా తొందరగా అవుట్ అయిపోయారు.

Written By: Gopi, Updated On : September 30, 2023 11:48 am

New Zealand Vs Pakistan

Follow us on

New Zealand Vs Pakistan: ఇంకో నాలుగు రోజుల్లో వరల్డ్ కప్ సమీపిస్తున్న సమయాన ప్రస్తుతం ఇప్పుడు ఉన్న టీం లన్ని కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వార్మప్ మ్యాచులు ఆడుతున్నారు. అందులో భాగంగానే పాకిస్తాన్ న్యూజిలాండ్ టీమ్ లా మధ్య ఒక వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్రపంచ దేశాలకు సవాలు చేస్తూ పాకిస్తాన్ మీద ఘన విజయం సాధించింది. మొన్నటిదాకా ప్రపంచ నెంబర్ వన్ టీం గా కొనసాగిన పాకిస్తాన్ న్యూజిలాండ్ దెబ్బకి చతికిల పడిపోయింది. దీంతో న్యూజిలాండ్ టీం ఎంత స్ట్రాంగ్ గా ఉందో ప్రపంచ దేశాలకు సైతం తెలియజేస్తూ వాళ్ల నుంచి మిగతా దేశాలకి ఎలాంటి ప్రమాదం ఉంది అనేది వాళ్ల ఆట తీరుతో చూపించారు.ఇక ఒకసారి మ్యాచ్ విశేషాలను కనుక చూసుకున్నట్లయితే…

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ కి వచ్చిన పాకిస్తాన్ టీం కి మొదట్లోనే పెద్ద దెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఓపెనర్లు అయినా షఫీక్ అలాగే ఇమామ్ ఉల్ హక్ ఇద్దరు కూడా పెద్దగా స్కోర్లు ఏమి చేయకుండా తొందరగా అవుట్ అయిపోయారు.ఇక దాంతో పాకిస్తాన్ కి అంత మంచి ఓపెనింగ్ అయితే రాలేదు. నెంబర్ త్రీ లో వచ్చిన బాబర్ అజమ్ గానీ, నెంబర్ ఫోర్ లో వచ్చిన మహమ్మద్ రిజ్వాన్ గానీ మరోసారి వాళ్ల ఫామ్ ని కొనసాగిస్తూ పాకిస్తాన్ టీం కి భారీ స్కోరు అందించడం లో ఆ టీం భారం మొత్తాన్ని భుజాల మీద వేసుకొని మోసారనే చెప్పాలి. దాదాపుగా వీళ్ళిద్దరూ కలిసి 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు దాంతో పాకిస్తాన్ టీం కొంతవరకు ఊపిరి పీల్చుకుంది. ఇక 80 పరుగులు చేసిన బాబర్ అజమ్ సంట్నార్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. అలాగే 103 పరుగులు చేసిన మహమ్మద్ రిజ్వాన్ కూడా రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు.ఇక దాంతో క్రీజులోకి వచ్చిన షకీల్ కూడా ఒక అద్భుతమైన నాక్ ఆడి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఇక 53 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్ లు కొట్టి 75 పరుగులు చేశాడు. సెంచరీ చేస్తాడేమో అనుకున్న సమయంలో నీశం బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయి వెనుతిరిగాడు. ఇక చివరిలో అఘా సల్మాన్ కూడా తన బ్యాట్ తో హిట్టింగ్ చేయడం వల్ల ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ చాలా అద్భుతమైన స్కోర్ ని అయితే రాబట్టగలిగింది. ఇక నిర్ణీత 50 ఓవర్లకి పాకిస్తాన్ ఐదు వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది. దాంతో పాకిస్తాన్ చాలా మంచి స్కోర్ రాబట్టగలిగింది. ఇక 346 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీం కి డేవిన్ కాన్వే రూపంలో ఒక భారీ దెబ్బ అయితే తగిలింది. ఆయన ఎదుర్కొన్న మొదటి బాల్ కే హాసన్ అలీ బౌలింగ్ లో అవుట్ అవ్వడం న్యూజిలాండ్ టీమ్ కి చాలా పెద్ద లోటు అనే చెప్పాలి. ఎందుకంటే కాన్వే ఒక భారీ హిట్టర్ కాబట్టి ఆయన అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ ని పరుగులు పెట్టిస్తాడు. అలాంటి కాన్వే అవుట్ అవ్వడంతో న్యూజిల్యాండ్ ఈ మ్యాచ్ లో గెలవడం కష్టమే అని చాలామంది అనుకున్నారు.

కానీ మరో ఓపెనర్ అయిన రచన్ రవీంద్ర, విలియం సన్ ఇద్దరు కలిసి పాకిస్తాన్ బౌలర్ల ను ధాటిగా ఎదుర్కొంటూ మూడో వికెట్ కి 179 పరుగుల పాట్నర్ షిప్ ని నిలకొల్పారు. దాంతో న్యూజిలాండ్ టీం లో గెలుపు మీద ఆశలు చిగురించాయి. ఇక 97 పరుగులు చేసిన రచన్ రవీంద్ర సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఆఘ సల్మాన్ వేసిన బౌలింగ్ లో ఓ చిన్నపాటి మిస్టేక్ చేయడం వల్ల బౌల్డ్ అయి సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. ఇక కెన్ విలియమ్ సన్ కూడా 54 పరుగులు చేసి మిగతా వాళ్ళకి బ్యాటింగ్ టెస్ట్ చేయడానికి అతను రిటైర్డ్ హర్ట్ గా వెను తిరగడం జరిగింది. ఇక వీళ్ల తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మిచెల్ 59 పరుగులు చేసి తను కూడా రిటైర్డ్ హార్డ్ గా వెనుతిరిగాడు.ఇక ఈ సమయంలోనే మంచి అవకాశాన్ని అందుకున్న లాతం, గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరు కూడా బాగా ఆడతారేమో అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం లో వీళ్ళిద్దరూ ఫెయిల్ అయిపోయారు.

ఇక దాంతో చాప్మన్ అలాగే నీషం ఇద్దరూ కలిసి న్యూజిలాండ్ టీం ని చివర్లో చాలా బాగా హిట్టింగ్ చేస్తూ టీమ్ ని గెలుపు వరకు తీసుకెళ్లారు. 33 పరుగులు చేసిన నీషం అవుట్ అవ్వగా, 65 పరుగులు చేసిన చాప్మన్ మాత్రం చివరి వరకు ఉండి మ్యాచ్ ని గెలిపించాడు. ఇక వీళ్ళ ధాటికి 43 ఓవర్ నాలుగో బాల్ కే న్యూజిలాండ్ చెయాల్సిన 346 టార్గెట్ ని రీచ్ అయింది.దాంతో ఇంకా ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ఈ మ్యాచ్ గెలిచేసింది… దీని ద్వారా ప్రపంచ దేశాలకి కూడా న్యూజిలాండ్ ఎంత శక్తివంతమైన టీమ్ అనేది మరొకసారి ప్రూవ్ చేసి చూపించింది…ఇక దీంతో మన టీమ్ కూడా ఈ వరల్డ్ కప్ లో గట్టి పోటి ని ఎదుర్కొబోతుంది అనే విషయం అయితే అర్థం అవుతుంది…