Healthy Foods: మానవ శరీరం పొద్దంతా ఉన్న విధంగా రాత్రి సమయంలో ఉండదు. అందుకే రాత్రి పడుకునే ముందు లైట్ ఫుడ్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. నేటి కాలంలో ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిన చాలా మంది జంక్ ఫుడ్ తీసుకుని అలాగే పడుకుంటారు. ఫలితంగా అది పూర్తిగా డైజేషన్ కాక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే కొందరు భోజనం చేసిన తరువాత పండ్లు తీసుకోవాలని చెబుతున్నారు. కానీ ఏ రకమైన పండ్లు తీసుకోవాలో తెలియక కొందరు తినకూడని పండ్లు తింటున్నారు. దీంతో ఇవి జీర్ణక్రియపై ప్రభావం చూపుతున్నాయి. అసలు రాత్రి భోజనం చేసిన తరువాత ఏ పండ్లు తీసుకోకూడదు? ఏవి తినాలి?
శరీరానికి అదనపు శక్తి రావడానికి పండ్లు సహకరిస్తాయి. పండ్లలో విటమిన్లు, ప్రోటీన్లతో పాటు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. దీంతో రోజూ వారి ఆహారం కన్నా ఇవి ఎక్కువ శక్తిని ఇస్తాయి. అందుకే చాలా మంది అన్నం తినడం తక్కువ చేసిన కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటారు. పండ్లను క్రమపద్ధతిలో తీసుకోకుంటే అవి విషంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రాత్రి అన్నం తిన్న తరువాత కొన్ని పండ్లను అస్సలు తినకూడదు. ఇవి తినడం వల్ల మేలు మాట అటుంచి కీడు చేసే ప్రమాదం ఉంది.
పండ్లలో రారాజు మామిడి. మామిడిలో చక్కెర నిల్వలు అధికంగా ఉంటాయి. ఇది తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. ఇందులోకార్బో హైడ్రెట్లు పుష్కలంగా ఉంటాయి. మామిడిని సాధారణ సమయంలో మాత్రమే తీసుకోవాలి. ఆహారం తిన్న తరువాత దీనిని తీసుకుంటే జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రి పూట తీసుకుంటే మరిన్ని సమస్యలు వస్తాయి.
యాపిల్ పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోజుకో యాపిల్ తినాలని వైద్యులు సూచిస్తారు. ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు యాపిల్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే రాత్రి భోజనం చేసిన తరువాత యాపిల్ తినడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. దీని వల్ల నిద్రకు భంగం కలిగే ప్రమాదం ఉంది.
నారింజలో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని అధికంగా పెంచుతుంది. రెగ్యులర్ గా నారింజను తిన్న వారి శరీరం కాంతివంతంగా మెరుస్తుంది. అయితే పడుకునే ముందు నారింజలో అమ్లం ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి పూట తింటే గుండెలో మంట పుడుతుంది.
జామపండు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇది అందుబాటులో ఉన్నా తినడానికి ఆసక్తి చూపరు. కానీ కొందరు రాత్రి భోజనం చేసిన తరువాత తినడానికి ప్రయత్నిస్తారు. కాని ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూసి ఎసిడిటీ సమస్యలు వస్తాయి.
వాస్తవానికి అరటిపండు జీర్ణక్రియకు ఎంతో మేలు. ఇది తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. కానీ రాత్రిపూట అరటిపండు తినడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.