Women T20 World Cup: న్యూజిలాండ్ కు సులభం.. మనకేమో కష్టం.. సెమీస్ వెళ్లాలంటే టీమిండియా ఆస్ట్రేలియాపై ఎంత తేడాతో గెలవాలంటే?

టి20 మహిళా ప్రపంచకప్ లో భారత జట్టు సత్తా చాటింది. న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ.. పాకిస్తాన్, శ్రీలంక జట్లపై అద్భుతమైన విజయాలు సాధించింది. ప్రస్తుతానికి గ్రూప్ - ఏ లో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 11, 2024 10:47 am

Women T20 World Cup(1)

Follow us on

Women T20 World Cup: శ్రీలంక జట్టుతో బుధవారం జరిగిన కీలకమైన మ్యాచ్ లో 82 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ విజయం ద్వారా భారత జట్టు నెట్ రన్ రేట్ గణనీయంగా పెరిగింది.. నాలుగు పాయింట్లతో, +0.576 నెట్ రన్ రేట్ తో గ్రూప్ – ఏ లో రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత జట్టు కంటే ముందు ఆస్ట్రేలియా తొలి స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు నాలుగు పాయింట్లు, +2.524 నెట్ రన్ తో గ్రూప్ – ఏ లో అగ్రస్థానంలో ఉంది. పాకిస్తాన్ జట్టు రెండు పాయింట్లు, నెట్ రన్ రేట్ +0.555, న్యూజిలాండ్ రెండు పాయింట్లు, నెట్ రన్ రేట్ -0.050 తో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. గ్రూప్ – ఏ లో శ్రీలంక జట్టు ఇంతవరకు ఒక విజయం కూడా సాధించలేదు. ఈ జట్టు పాయింట్ల పట్టికలో -2.564 నెట్ రన్ రేట్ తో చివరి స్థానంలో ఉంది. దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది.. ఆదివారం టీమిండియా ఆస్ట్రేలియా జట్టుతో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.. దీంతో గ్రూప్ – ఏ లో సర్వీస్ సమీకరణాలు ఉత్కంఠ గా మారాయి. అయితే గ్రూప్ – ఏ లో అన్ని జట్ల కంటే ఆస్ట్రేలియాకు సెమీస్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అప్పుడే సెమీస్ వెళ్తుంది

ఆస్ట్రేలియా జట్టు తన తదుపరి మ్యాచ్ లను పాక్, భారత్ పై ఆడుతుంది. ఈ రెండు జట్లపై విజయం సాధిస్తే అజేయంగా సెమీస్ వెళ్తుంది. ఒకవేళ భారత చేతిలో ఓడి.. పాకిస్తాన్ పై గెలిస్తే.. న్యూజిలాండ్ జట్టు తన మ్యాచ్ లలో ఒక దాంట్లో గెలిచి, మరొక దాంట్లో ఓడితే నెట్ రన్ రేట్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా ఆస్ట్రేలియా సెమీఫైనల్ వెళ్తుంది.. గ్రూప్ – ఏ లో పోటీ మొత్తం రెండవ స్థానం గురించి చర్చ సాగుతోంది. సెమీస్ రేసులో భారత జట్టుకు పోటీగా న్యూజిలాండ్ ఉంది. పాకిస్తాన్ జట్టుకు అవకాశం ఉన్నప్పటికీ.. ఆ జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో తలపడాల్సి ఉంది. దీంతో అసలు సిసలైన పోటీ భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య సాగుతుందని తెలుస్తోంది. అలాంటప్పుడు ఆస్ట్రేలియా జట్టు పై భారత్ కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిచి.. పాకిస్తాన్ జట్టుపై ఆస్ట్రేలియా విజయం సాధించి.. న్యూజిలాండ్ తన మిగిలిన మ్యాచ్ లలో శ్రీలంక, పాకిస్తాన్ జట్టుపై గెలిస్తే ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్ ఆరు పాయింట్లతో సమానంగా ఉంటాయి. ఆ సమయంలో మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. ఈ క్రమంలో భారత జట్టు అత్యంత జాగ్రత్తగా సెమీఫైనల్ వెళ్లాలంటే ఆస్ట్రేలియాపై పైతరహాలు విజయం సాధించాల్సి ఉంటుంది.. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టుపై భారత్ ఒకే ఒక్క పరుగుతో నెగ్గితే.. శ్రీలంక, పాకిస్తాన్ జట్ల పై న్యూజిలాండ్ 38 పరుగుల కంటే తక్కువ తేడాతో విజయం సాధించాలి. ఒకవేళ టీమిండియా 10 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా పై గెలిస్తే.. న్యూజిలాండ్ 48 పరుగుల కంటే తక్కువ తేడాతో శ్రీలంక, పాకిస్తాన్ జట్లపై గెలవాలి. అప్పుడే భారత జట్టు నెట్ రన్ రేట్ ను న్యూజిలాండ్ అధిగమించదు.

ఒకవేళ టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే..

ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా ఒకవేళ ఓడిపోయిన సెమీ చేరడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు న్యూజిలాండ్ పాకిస్తాన్ లేదా శ్రీలంక జట్టుపై ఓడిపోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఆస్ట్రేలియా చేతిలో భారత్ తక్కువ పరుల తీరతో ఓడిపోవాలి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకమవుతుంది.