Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన హోటల్ టాస్క్ ఎట్టకేలకు ముగిసిన విషయం నిన్న ఎపిసోడ్ లో చూసిన తర్వాత మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది. ఈ టాస్క్ ముగిసింది అని బిగ్ బాస్ ప్రకటన చేయగానే హౌస్ మేట్స్ అందరూ ‘హమ్మయ్యా..!’ అని బిగ్ బాస్ కి దండం పెడుతారు. సరిగ్గా అలాంటి రియాక్షన్ ఆడియన్స్ నుండి కూడా వచ్చింది. ఆసక్తికరమైన ఫిజికల్ టాస్కులు పెట్టి గేమ్ ని రక్తికట్టించాల్సింది పోయి, రెండు రోజుల పాటు బిగ్ బాస్ హోటల్ టాస్క్ ని నిర్వహించి, కంటెస్టెంట్స్ చెత్త కామెడీ తో ఆడియన్స్ కి విసుగు పుట్టేలా చేసారు. స్కూల్ లో చిన్న పిల్లలు ఆడుకునే గేమ్స్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇవ్వడం ఏంటో బిగ్ బాస్ కే తెలియాలి. కప్పలాగా గెంతడం ఒక టాస్క్ అట, అలాగే లెమన్ స్పూన్ గేమ్ కూడా మరో టాస్క్ అట.
ఇది ఎక్కడి విచిత్రం, చిన్న పిల్లలు ఆడుకునే గేమ్స్ ని నిఖిల్, పృథ్వీ, నభీల్ లాంటి టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ చేత ఆడిస్తారా..?, కొత్త టాస్క్ డిజైన్ చేయడానికి మెటీరియల్ కి ఖర్చు చేసేందుకు కక్కుర్తి పడి బిగ్ బాస్ ఇలాంటి పిల్ల ఆటలను డిజైన్ చేసారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ సెటైర్లు వేసుకుంటున్నారు. అయితే ఎట్టకేలకు ఈ టాస్క్ ముగిసింది అనే శుభవార్తను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి, ఆడియన్స్ కి తెలుపుతాడు. రాయల్ క్లాన్ వద్ద ఎక్కువ డబ్బులు ఉండడం తో వాళ్ళను టాస్క్ విజేతలుగా ప్రకటిస్తాడు బిగ్ బాస్. రాయల్ క్లాన్ గెలిచినందుకు గానూ, వాళ్ళ టీం నుండి ఆరు మంది కంటెస్టెంట్స్ కి చీఫ్ పోటీదారులు అయ్యేందుకు బిగ్ బాస్ అవకాశం ఇస్తాడు. ఆ ఆరు మంది ఎవరో మీలో మీరు చర్చించుకొని చెప్పమంటాడు బిగ్ బాస్. గంగవ్వ, టేస్టీ తేజా తప్ప ఆ క్లాన్ లో ఆరు మంది చీఫ్ పోటీదారులుగా నిలుస్తారు.
అలాగే ఓజీ క్లాన్ నుండి కేవలం మణికంఠ మాత్రమే చీఫ్ కంటెండర్ గా నిలుస్తాడు. బిగ్ బాస్ ఆ టీం నుండి మరో ఇద్దరికీ కానీ, లేదా ముగ్గురికి కానీ అవకాశం ఇవ్వొచ్చు. కానీ దీనిపై స్పష్టత ఇంకా రాలేదు. రేపటి ఎపిసోడ్ లో అసలు ఏమి జరిగింది అనే విషయం తెలుస్తుంది. రాయల్ క్లాన్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఓజీ క్లాన్ మీద పై చేయి సాధిస్తూనే ఉన్నారు. ఓజీ క్లాన్ లో కసిగా టాస్కులు ఆడుతున్న కంటెస్టెంట్స్ నిఖిల్, నభీల్, యష్మీ, ప్రేరణ, మణికంఠ. ఇక పృథ్వీ ఈ వారం టాస్కులు ఆడినట్టుగా ఆడియన్స్ కి పెద్దగా కనిపించలేదు. ఆయనకు టాస్కులు ఆడే స్కోప్ కూడా చాలా తక్కువగా వచ్చింది. సీత ప్రయత్నం చేసింది కానీ, మొదటి రెండు వారాల్లో కనిపించిన సీత మాత్రం ఇప్పటికీ కనిపించలేదనే చెప్పాలి.