https://oktelugu.com/

CM Chandrababu : తనను అలా చంపాలని చూశారా? బయట పెట్టేసిన చంద్రబాబు!

అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజులపాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అప్పట్లో ఆయనను అంతం చేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు జరిగినట్లు విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని బయటపెట్టారు చంద్రబాబు.

Written By:
  • Dharma
  • , Updated On : October 11, 2024 / 10:48 AM IST

    CM Chandrababu

    Follow us on

    CM Chandrababu : వైసిపి హయాంలో చంద్రబాబు చంపే ప్రయత్నం చేశారా? జైలులో ఉన్న సమయంలో ఆ ప్లాన్ చేశారా? డ్రోన్ కెమెరాలు ఎగురవేశారా? కనీసం దోమతెర కూడా ఇవ్వలేదా? అంటే అవునంటున్నారు చంద్రబాబు. వైసిపి హయాంలో తానే ప్రథమ బాధితుడినని గుర్తు చేస్తున్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నేతలపై రివేంజ్ రాజకీయాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో చంద్రబాబు వైసీపీ నాటి చర్యలను గుర్తు చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో అవినీతి కేసుల్లో చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 52 రోజులు పాటు చంద్రబాబు ఉండిపోవాల్సి వచ్చింది. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఎక్కడా బెయిల్ లభించలేదు. చివరకు అనారోగ్య కారణాలు చూపడంతో సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అయితే అప్పట్లో చంద్రబాబు ఆరోగ్యం పై ఆందోళన రేగింది. ఆ వయసులో చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని జైలులో పెట్టించారని టిడిపి నేతలు ఆరోపించారు. ఆధారాలు లేని కేసుల్లో ఇరికించి జైలు పాలు చేసి రాక్షసానందం పొందారని ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు అధికారం మారింది. వైసిపి ఓడిపోయింది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది.

    * శాంతిభద్రతలపై వైసీపీ ఆరోపణలు
    గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో వైసిపి ఆందోళన చెందుతోంది. ఒకవైపు ఆ పార్టీ నేతలపై దాడులు పెరుగుతున్నాయి. భారీగా కేసులు నమోదవుతున్నాయి. వీటికి భయపడి చాలామంది వైసిపి నేతలు టిడిపిలో చేరుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి భారీ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని.. ప్రతీకర రాజకీయాలు కొనసాగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు.

    * తొలి బాధితుడును
    తాజాగా వైసీపీ నేతల విమర్శలపై చంద్రబాబు స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తొలి బాధితుడు తానేనని గుర్తు చేశారు. అప్పట్లో తాను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా పెట్టిన ఇబ్బందులను చెప్పుకొచ్చారు. డ్రోన్ కెమెరాలు ఎందుకు ఎగురవేశారు అని ప్రశ్నించారు. కనీసం జైలులో తనకు దోమతెర కూడా అందించలేదన్నారు. కరుడుగట్టిన ఖైదీల మధ్య తనను ఉంచిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. కానీ తాము అలా ప్రతీకార రాజకీయాలకు దిగమని చెబుతున్నారు. వైసీపీ నేతలవి అనవసర ప్రసారాలుగా చెబుతున్నారు. మొత్తానికి అయితే తనకు ఎదురైన పరిణామాలను చంద్రబాబు బయట పెట్టడం విశేషం.