ఐపీఎల్ వైరల్:హైదరాబాదీ కా మామ.. విలియమ్సన్‌ రాకతో సన్‌‘రైజ్‌’

తాజా ఐపీఎల్‌లో మొదటి సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు‌ తన ప్రతిభను చాటింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సన్‌రైజర్స్.. మూడో మ్యాచ్‌లో ఢిల్లీని చిత్తు చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న ఢిల్లీని ఆల్‌రౌండ్ ప్రతిభతో దెబ్బతీసింది. జట్టులోకి కేన్‌ విలియమ్సన్‌ ఎంటర్‌‌ ఇవ్వడంతో జట్టు సన్‌ ‘రైజ్‌’ అయింది. సన్‌రైజర్స్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో జట్టులో కేన్ విలియమ్సన్‌ను ఆడించాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఫస్ట్ మ్యాచ్‌లో పేస్ ఆల్‌రౌండర్‌ […]

Written By: NARESH, Updated On : September 30, 2020 5:13 pm

sun rise

Follow us on


తాజా ఐపీఎల్‌లో మొదటి సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు‌ తన ప్రతిభను చాటింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సన్‌రైజర్స్.. మూడో మ్యాచ్‌లో ఢిల్లీని చిత్తు చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న ఢిల్లీని ఆల్‌రౌండ్ ప్రతిభతో దెబ్బతీసింది. జట్టులోకి కేన్‌ విలియమ్సన్‌ ఎంటర్‌‌ ఇవ్వడంతో జట్టు సన్‌ ‘రైజ్‌’ అయింది. సన్‌రైజర్స్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో జట్టులో కేన్ విలియమ్సన్‌ను ఆడించాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఫస్ట్ మ్యాచ్‌లో పేస్ ఆల్‌రౌండర్‌ మిచెల్ మార్ష్‌ను ఆడించినప్పటికీ.. ఆదిలోనే అతడు గాయపడటంతో.. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గట్టి ప్రభావం పడింది.

Also Read: ఐపీఎల్ అభిమానులకు పెద్ద షాక్..

ఇక రెండో మ్యాచ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ నబీని తుది జట్టులోకి వచ్చాడు. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా.. బౌలింగ్ పొదుపుగానే చేసి వికెట్లు తీయలేకపోయాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ వైఫల్యం వెంటాడటంతో.. మూడో మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్‌తోపాటు అబ్దుల్ సమద్‌ను ఆడించారు. ఈ మార్పు ఫలితాన్ని ఇచ్చింది.

నిన్నటి మ్యాచ్‌లో వార్నర్‌‌ చక్కటి ఆరంభాన్ని ఇవ్వగా.. జానీ బెయిర్‌‌ స్టో ఇన్నింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు.మనీష్ పాండే నిరాశపర్చినా.. కేన్ విలియమ్సన్ ఆదుకున్నాడు. 26 బంతుల్లోనే 41 రన్స్ చేసిన విలియమ్సన్ సన్‌రైజర్స్ 160 పరుగుల మార్క్ దాటడంలో కీలక పాత్ర పోషించాడు. అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలిపాడు. రెండో మ్యాచ్‌లో విలియమ్సన్ ఉంటే బాగుండేదన్న అభిమానుల భావన నిజమేనని నిరూపించాడు.

Also Read: ఐపీఎల్ మ్యాచ్ అంటే ఇదీ: ఉత్కం‘టై’నా.. కోహ్లీ సేన మ్యాజిక్ ఇదీ!

విలియమ్సన్ జట్టులోకి రావడం.. సన్‌రైజర్స్ విజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘విలియమ్సన్ మామ వచ్చాడు’ అంటూ కొందరు ఫ్యాన్స్ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఢిల్లీతో మ్యాచ్‌లో బరిలో దిగిన ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, వార్నర్ ఫొటోను షేర్ చేసిన సన్‌రైజర్స్.. చిన్నోడు అండ్ పెద్దోడు అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా డైలాగ్‌ను ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ విలియమ్సన్‌ను రేలంగి మావయ్యతో పోల్చుతూ మంచోడని కితాబిచ్చారు. కామెంట్రీ మధ్యలో హర్షాభోగ్లే విలియ్సమన్ గురించి మాట్లాడుతూ అన్నొచ్చాడని ఫ్యాన్స్‌ అంటున్నారని కామెంట్‌ చేశాడు. ‘హర్షా సార్.. కేన్ అన్న కాదు.. హైదరాబాద్‌లో కేన్ మామ అంటామంటూ’ ఈ హైదరాబాదీ కామెంటేటర్‌కు రిప్లయ్‌లు ఇచ్చారు.