https://oktelugu.com/

వెంకీ ఆఫర్.. శర్వానంద్ చేతుల్లోకి?

సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ స్టైలే సపరేట్ గా ఉంటుంది. డిఫరెంట్ సినిమాలు చేసేందుకు వెంకటేశ్ ఎప్పుడు ముందుంటారు. అయితే ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఎనలేని క్రేజ్ ఉంది. కొంతకాలం హిట్టు సినిమాలకు దూరంగా ఉన్న వెంకటేష్ ‘దృశ్యం’.. ‘ఎఫ్-2’ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని ఫామ్ లోకి వచ్చాడు. Also Read: బిగ్ బాస్: పాపం అరియానా.. ‘మాస్టార్’ చేతిలో మోసపోయింది..! ఈ రెండు కూడా ఫ్యామిలీ సినిమాలే కావడం విశేషం. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2020 / 03:03 PM IST

    venki

    Follow us on


    సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ స్టైలే సపరేట్ గా ఉంటుంది. డిఫరెంట్ సినిమాలు చేసేందుకు వెంకటేశ్ ఎప్పుడు ముందుంటారు. అయితే ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఎనలేని క్రేజ్ ఉంది. కొంతకాలం హిట్టు సినిమాలకు దూరంగా ఉన్న వెంకటేష్ ‘దృశ్యం’.. ‘ఎఫ్-2’ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని ఫామ్ లోకి వచ్చాడు.

    Also Read: బిగ్ బాస్: పాపం అరియానా.. ‘మాస్టార్’ చేతిలో మోసపోయింది..!

    ఈ రెండు కూడా ఫ్యామిలీ సినిమాలే కావడం విశేషం. ‘దృశ్యం’ సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతూనే ఫ్యామిలీ సెంట్ మెంట్ పండించింది. ఇక ‘ఎఫ్-2’ ఫ్యామిలీ ఎంటటైన్మెంట్ కథాంశంతో తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలు మరోసారి వెంకటేష్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేశాయి. ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

    2017లోనే ఈ సినిమాపై దర్శకుడు కిషోర్ తిరుమల అనౌన్స్ చేయగా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ మూవీ షూటింగులో బీజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత కూడా ‘ఆడవాళ్లు మీకు జోహర్లు’ మూవీ పట్టాలెక్కేలా కన్పించడం లేదు. దీంతో ఈ సినిమా యంగ్ హీరో శర్వానంద్ దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

    దర్శకుడు కిషోర్ తిరుమల గతంలో రామ్ హీరోగా ‘ఉన్నది ఒక్కటే జిందగీ’.. సాయిధరమ్ తేజుతో కలిసి ‘చిత్రలహరి’ మూవీలు చేశాడు. ప్రస్తుతం రామ్ హీరోగా ‘రెడ్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజుకు సిద్ధంగా ఉంది. దీంతో తన తదుపరి చిత్రం ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ మూవీని తెరకెక్కించేందుకు కిషోర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మూవీలో నటించేందుకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    Also Read: రెంటికి చెడ్డ రేవడిలా టాలీవుడ్ దర్శకులు..!

    దీంతో ఈ మూవీ విక్టరీ వెంకటేష్ నుంచి శర్వానంద్ చేతుల్లోకి వచ్చిందనే టాక్ విన్పిస్తోంది. ఇదిలా ఉంటే శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ చివరి దశకు చేరుకుంది. ఇక ‘ఆర్ఎక్స్-100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘మహాసముద్రం’లో శర్వానంద్ నటించాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలు ముగిశాకే ‘ఆడాళ్లు మీకు జోహర్లు’ పట్టాలెక్కనుందనే టాక్ విన్పిస్తోంది.