Team India: టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా లీగ్ దశలోనే వెనుదిరిగింది. దీంతో జట్టు కూర్పులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టు కెప్టెన్ తో సహా పలువురిని మార్చడం జరిగింది. నూతన సారధిగా రోహిత్ శర్మను ఎన్నుకున్నారు. వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను నియమించారు. దీంతో ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ తో ఆడే టీ 20 మూడు మ్యాచులకు జట్టు ఎంపిక జరిగింది. బీసీసీఐ ఆధ్వర్యంలో నూతన జట్టు కూర్పు జరిగింది.

ఇండియా, కివీస్ జట్ల మధ్య ఈ నెల 17న జైపూర్ లో తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే కరోనా టీకా తీసుకున్న వారికే మైదానంలో ప్రవేశం కల్పిస్తారని తెలుస్తోంది. మాస్కులు, శానిటేషన్ తదితర పరీక్షలు ఉంటాయని చెబుతున్నారు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య టీ 20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. రెండో ఆట రాంచీలో నవంబర్ 19న నిర్వహించనుంది. మూడో మ్యాచ్ కోల్ కత వేదికగా నవంబర్ 21న ఆడనుందని తెలుస్తోంది. నవంబర్ 25-29 మధ్య కాన్పూర్ లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబై వేదికగా రెండో డెస్టు జరగనుంది.
Also Read: Rohith Sharma:టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మనే ఎందుకు..?
దీని కోసం జట్టును కూడా ప్రకటించారు. ఇప్పటికే ఓటమితో పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును విజయాలు పలకరిస్తాయా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది పరాజయాల బాట నుంచి విజయాల వైపు దూసుకెళ్లేందుకు ఏం ప్రణాళికలు రచిస్తుందో అన్న సందేహాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సారధి రోహిత్ శర్మపై అభిమానులకు భారీ ఆశలే ఉన్నాయి.
Also Read: టీమిండియాకు కొత్త ఆల్ రౌండర్.. హార్ధిక్ పాండ్యా పని అయిపోయినట్టే?