Shardul Thakur: దక్షిణాఫ్రికాలో చిరకాల వాంఛ నెరవేర్చుకునే క్రమంలో వెళ్లిన జట్టు తన కోరిక నెరవేర్చుకునేందుకు శ్రమిస్తోంది. ఇప్పటికే కీలక ఆటగాళ్లు దూరం కావడంతో అనుమానాలు వచ్చినా మన ఆటగాళ్లు సమష్టి ఆట తీరుతో మొదటి టెస్టులో విజయం సాధించి మన ఆశలను సజీవం చేశారు. ఇంతవరకు దక్షిణాఫ్రికాలో ఒక టెస్ట్ సిరీస్ కూడా నెగ్గకపోవడం బాధాకరమే. దీన్ని ఈ సారి సఫలం చేయాలని వెళ్లిన జట్టుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో విజయంపై అనుమానాలు వచ్చాయి. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మొదటి టెస్టులో విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టుపై కూడా పట్టు బిగించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. జోహన్స్ బర్గ్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు పుంజుకుని మనకు మంచి వార్తనే అందించనున్నారనే అర్థమైపోతోంది.
Also Read: టీమిండియాకు కోహ్లి గుడ్ బై చెప్పనున్నాడా?
లంచ్ విరామ సమయానికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. దీంతో భారత జట్టుపై ఒత్తిడి పెరిగిందని అనుకోవచ్చు. కానీ భారత్ తొలి ఇన్నింగ్స్ లో 202 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా వెనుకబడినట్లు తెలుస్తోంది. శార్దూల్ ఠాకూర్ (3/8) తో దక్షిణాఫ్రికాను డైలమాలో పడేశాడు. దీంతో టీమిండియా ఆశలు సజీవంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికా కూడా సరైన విధంగా స్పందించడంతో తొలి సెషన్ లో దాదాపు 20 ఓవర్ల పాటు డీన్ ఎల్గర్, కీగన్ పీటర్సన్ జంట భారత బౌలర్లను ఎదుర్కోవడంతో రికార్డు భాగస్వామ్యం చేశారు. కానీ శార్దూల్ కీలక వికెట్లుతీయడంతో భారత్ కు కూడా అవకాశం దక్కేందుకు సహకరించాడు. కానీ టీమిండియా ఏ మేరకు సద్వినియోగం చేసుకుని చిరకాల వాంఛను తీర్చుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read: విరాట్ కోహ్లీకి ఏమైంది? రెండో టెస్టు నుంచి సడెన్ గా ఎందుకు తప్పుకున్నాడు?