Bheemla Nayak: సంక్రాంతి బరిలో దూకేస్తా అంటూ హడావిడి చేసిన భీమ్లా నాయక్ మొత్తానికి సైలెంట్ అయిపోయి, ప్రీ సమ్మర్ టైమ్ కు రిలీజ్ కి రెడీ అంటున్నాడు. కాకపోతే, అప్పుడయినా విడుదలకు సిద్ధం అవుతాడా ? లేక ఎప్పటిలాగే ఏదొక కారణం చెప్పి.. విడుదల వాయిదా వేస్తాడా ? అన్నదే ప్రధాన అనుమానం. ఇప్పటికి అయితే భీమ్లా నాయక్ మేకర్లకు అసలు క్లారిటీ లేదు.

తమ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలి ? అసలు ఆ మాటకొస్తే.. అనుకున్న విధంగా షూటింగ్ చేయగలమా అనే భయంలో ఉంది ఈ సినిమా టీమ్. ఒకటి కరోనా భయం అయితే, మరొకటి పవన్ డేట్లు భయం. పవన్ ఈ సినిమా కోసం కేటాయించిన డేట్లు అన్నీ ఇప్పటికే అయిపోయాయి. ఈ నేపథ్యంలో పవన్ నుంచి అదనపు డేట్లు అడగాలి అంటే.. కాస్త ఇబ్బందే.
Also Read: ‘భీమ్లా నాయక్’ రావాల్సిందే అంటున్న ఫ్యాన్స్.. సినిమా రిలీజ్ అప్పుడేనా?
పవన్ మొదటి నుంచి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెళ్ళండి అంటూ చాలాసార్లు చెప్పాడు. కానీ, భీమ్లా నాయక్ టీమ్ ఆ విషయంలో అసలు క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్లు షూటింగ్ చేస్తూ.. కష్టం అనిపిస్తే.. షూట్ కి లాంగ్ గ్యాప్ ఇస్తూ ముందుకు పోయింది. మొత్తమ్మీద భీమ్లా నాయక్ విడుదల పై అనేక అనుమానాలు ఇంకా ఉండనే ఉన్నాయి.
అన్నిటికీ మించి రిలీజ్ అయ్యే నాటికి కరోనా కనుక తగ్గకుండా అలాగే వుంటే అది ఇంకా పెద్ద సమస్య. మరోపక్క పవన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? ఎప్పుడు తొక్కేద్దాం అంటూ జగన్ బాగా పట్టుదలగా ఉన్నాడు. సో.. పవన్ సినిమా వస్తే.. జగన్ థియేటర్లకు ఫిప్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదా మరో కారణం చెప్పి థియేటర్స్ ను సీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు ఇదే భయం భీమ్లా నాయక్ ను వెంటాడుతుంది.