Justice Statue: కళ్లు తెరిచిన న్యాయదేవత.. సుప్రీం కోర్టులో సరికొత్తగా విగ్రహం!

న్యాయ దేవత అనగానే మనకు కళ్లకు గంతలు, ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో ఖడ్గం గుర్తొస్తుంది. స్వాంత్రం వచ్చిన నాటి నుంచి న్యాయదేవత రూపం ఇదే.

Written By: Raj Shekar, Updated On : October 17, 2024 1:55 pm

Justice Statue

Follow us on

Justice Statue: దేవుళ్ల రూపాలను బట్టి మనం ఏ దేవుడో చెబుతాం. చేతిలో త్రిశూలం ఉంటే శివుడిగా, చేతిలో ధనస్సు ఉంటే రాముడిగా, చేతిలో విష్ణుచక్రం ఉంటే.. విష్ణుమూర్తిగా.. ఇక అమ్మవార్లను అయితే వారి వాహనాల ఆధారంగా గుర్తిస్తాం. హంస వాహిణి సరస్వతిగా, పద్మ వాహిణిని లక్ష్మీదేవిగా, సింహవాహినిని ఆది శక్తిగా కొలుస్తా. ఈ దేవుళ్లను భక్తులు నిత్యం పూజిస్తారు. కానీ మనం పూజించన దేవత కూడా ఒకరు ఉన్నారు. ఈ దేవత విగ్రహం బయట ఎక్కడా కనిపించదు. కోర్టుల్లో, న్యాయమూర్తుల ఇళ్లలో, న్యాయవాదుల భవనాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇప్పటికే మీకు అర్తమై ఉంటుంది.. అవును మీరు అనుకున్నట్లే.. న్యాయదేవత. న్యాయదేవంత విగ్రహం కళ్లకు గంతలు కట్టుకుని కనిపిస్తుంది. ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో ఖడ్గం ఉంటుంది. ఈ రూపమే అందరికీ తెలుసు. దశాబ్దాలుగా న్యాయదేవత ఈ రూపంలోనే మనందరికీ తెలుసు. కానీ, చాలా ఏళ్ల తర్వాత న్యాయదేవంత కళ్లు తెరుచుకున్నాయి. కళ్లకు గంతలు తొలగిపోయాయి. ఇక చేతిలో ఉన్న ఖడ్గం తొలగిపోయింది. ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో రాజ్యంగం చేర్చారు. ఇలా కొత్తగా కనిపిస్తున్న న్యాయదేవత విగ్రహం ప్రస్తుతం సుప్రీం కోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలో కనిపిస్తుంది.

బ్రిటిష్‌ కాలం నుంచి..
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటింది. కానీ న్యాయదేవతను మాత్రం ఇప్పటికీ మనం బ్రిటిష్‌ కాలం విగ్రహాన్నే ఉపయోగిస్తున్నాం. చట్టాలు కూడా మొన్నటి వరకు బ్రిటిష్‌ కాలం నాటివే ఉన్నాయి. ఐపీసీ పేరుతో బ్రిటిష్‌ చట్టాలను అమలు చేశాం. కానీ, ఇటీవలే కేంద్రం న్యాయ సంహిత పేరుతో కొత్త చట్టాలను తెచ్చింది. బ్రిటిష్‌ కాలంనాటి పరిస్థితుల ఆధారంగా న్యాయదేవత విగ్రహాన్ని కళ్లకు గంతలు, ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో ఖడ్గంతో తయారు చేశారు. చట్టం ముందు అందరూ సమానమని చెప్పేందుకే న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టారు. కుడిచేతిలో ఉండే త్రాసు న్యాయానికి సూచిక. ఎడమ చేతిలో ఉండే ఖడ్గం అన్యాయాన్ని అంతం చేస్తుందని తెలిపే సూచికగా భావించారు.

కొత్త విగ్రహం ఇలా..
ఇక బ్రిటిష్‌ కాలం నాటి న్యాయదేవత విగ్రహాన్ని ఇప్పుడు సుప్రీకోర్టులో మారుస్తున్నారు. సీజేఐ డీవై.చంద్రచూడ్‌ సూచనల మేరకు న్యాయదేవత విగ్రహం కళ్లకు ఉన్న గంతలు తొలగించారు. రెండు కళ్లు తెరిచి అందరినీ సమానంగా చూడగలదని చెప్పడానికి కళ్లకు గంతలను తొలగించారు. ఇక ఎడమ చేతిలో కత్తికి బదులు రాజ్యాంగం ఉంచారు. దీని అర్థం.. రాజ్యాంగాన్ని అనుసరించి న్యాయదేవత అన్యాయాన్ని గుర్తిస్తుందని, రాజ్యాంగం ప్రకారమే శిక్ష విధిస్తుందని అర్థం. ఈ విషయాలను సీజేఐ డీవై.చంద్రచూడ్‌ స్వయంగా వెల్లడించారు.