Rohit Sharma Virat Kohli: సిడ్ని వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు పై టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు రికార్డు స్థాయిలో సెంచరీకి మించిన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తద్వారా టీమిండియా కు 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. ఈ విజయం ద్వారా టీమిండియా సిరీస్ ఓటమి నుంచి కాస్త ఉపశమన విజయాన్ని పొందింది.
Also Read: హౌస్ లోకి వరుసగా ఎంట్రీ ఇస్తున్న ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్..షాక్ లో హౌస్ మేట్స్!
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో కూడా పాజిటివ్ కథనాలు ప్రసారమవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి పక్కకు తప్పుకున్నారు. మేనేజ్మెంట్ కూడా రోహిత్ శర్మను సారథి స్థానం నుంచి పక్కన పెట్టింది. అతడి స్థానంలో గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో గిల్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో విఫలమయ్యాడు. మూడో వన్డేలో 20కి పైగా పరుగులు చేసినప్పటికీ.. దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సూపర్ ఫామ్ లోకి రావడంతో 2027 వరల్డ్ కప్ లో ఆడతారా? లేదా? అనే చర్చ మొదలైంది.
సిడ్నీలో రోహిత్ 121*, విరాట్ కోహ్లీ 74* పరుగులు చేయడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ 2027 వరల్డ్ కప్ లో ఆడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇదే ప్రశ్నను విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మను అడిగితే.. 2027 వరల్డ్ కప్ లో ఆడేందుకు అత్యంత ఆసక్తికరంగా ఉన్నామని సమాధానం చెప్పారు.. దీంతో అభిమానులు వీళ్లకు ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమేనని.. వన్డే వరల్డ్ కప్ లో ROKO ఆడతారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో రోహిత్ శర్మ అభిషేక్ నాయర్ ను వ్యక్తిగత కోచ్ గా నియమించుకున్నాడు. అతడి సూచనలతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. బరువు కూడా చాలా వరకు తగ్గాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడం మొదలుపెట్టాడు. తనలోపాలను సవరించుకున్నాడు. తొలి వన్డేలో విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత రెండు వన్డేలలో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు రోహిత్. ఇక విరాట్ కూడా తొలి రెండు వన్డేలలో విఫలమైనప్పటికీ…మూడో వన్డేలో తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి అదరగొట్టాడు. సూపర్ హాఫ్ సెంచరీ చేసి టచ్ లోకి వచ్చాడు. అంతేకాదు విమర్శకుల నోళ్లకు తాళాలు వేశాడు.