Bigg Boss 9 Telugu Eliminated Contestants: ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన ఏ బిగ్ బాస్ తెలుగు సీజన్(Bigg Boss 9 Telugu) లో కూడా రానటువంటి ట్విస్ట్ వచ్చే వారం రాబోతోంది. రెండవ వారం నుండి, గత వారం వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ, రమ్య ఎలిమినేషన్ జరిగిన తర్వాత ఒక్కొక్కరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భరణి, దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, ఫ్లోరా షైనీ, మాస్క్ మ్యాన్ హరీష్ వంటి వారు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నారట. వీళ్ళ కోసం అవుట్ హౌస్ ని శుభ్రంగా ఉంచి పెట్టారట. వీళ్లంతా ఒక వారం రోజుల పాటు హౌస్ లోనే ఉంటారట. ఆ తర్వాత చివర్లో కేవలం ఇద్దరు మాత్రమే హౌస్ లో చివరి వరకు ఉంటారట. ఆ ఇద్దరు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
దమ్ము శ్రీజ ఎలిమినేషన్ అన్యాయం గా జరిగింది కాబట్టి, ఆమె హౌస్ లోకి రీ ఎంట్రీ ద్వారా రావాలని సోషల్ మీడియా ద్వారా వేలాది మంది నెటిజెన్న్ కోరుకున్నారు. అదే విధంగా భరణి కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని, చాలా మంచోడు అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బలంగా కోరుకుంటున్నారు. నెటిజెన్స్ లో కూడా ఆయన రీ ఎంట్రీ ఇవ్వాలనే కోరిక ఉంది. ఎందుకంటే చాలా బలమైన కంటెస్టెంట్, టాప్ 5 వరకు వచ్చి ట్రోఫీ ఎట్టేంత సత్తా ఉన్న కంటెస్టెంట్ కాబట్టి. మరి భరణి ఉంటాడా లేదా అనేది చూడాలి. అయితే వీళ్లంతా వారం వరకు హౌస్ లో ఉండి ఏమి చేస్తారు?, అసలు బిగ్ బాస్ టీం ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లుప్తంగా విశ్లేషిద్దాం. ఈ వారం మొత్తం ఈ ఆరు మందికి టాస్కులు పెట్టి, ఎవరైతే ఎక్కువ టాస్కులు గెలుస్తారో, వారిలో టాప్ 2 ని హౌస్ లో ఉంచి, మిగిలిన వాళ్ళను బయటకు పంపేయొచ్చు.
అలా కాకుండా వారం మొత్తం ఈ ఆరు మంది ఆట తీరుని గమనించి, శనివారం రోజున హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా టాప్ 2 ని ఉంచి,మిగిలిన వాళ్ళను పంపేయడం. ఇది కూడా కాకుండా ఈ ఆరు మందిని డైరెక్ట్ గా నామినేషన్స్ లో ఉంచి, మరోసారి ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎవరైతే టాప్ 2 లో ఉంటారో, వాళ్ళను మాత్రమే హౌస్ లోపల ఉంచి, మిగతా వాళ్ళను బయటకు పంపేయడం. ఇలా ఎదో ఒకటి బలంగా జరగబోతోంది. ఈ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ద్వారా హౌస్ మేట్స్ ని నామినేట్ కూడా చేయిస్తారట. ఇలా చేస్తే భరణి ఎవరిని నామినేట్ చేస్తాడు?, తన ఇద్దరు కూతుర్లు తనూజ,దివ్య లను నామినేట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది వచ్చే వారం ఆసక్తికరంగా ఉండబోతోంది, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.