Man Harassed Australian Cricketers: మన వ్యవస్థ సక్రమంగా పనిచేసి.. మన పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే అరాచక శక్తులు నోరు మూసుకుంటాయి. ఇంకోసారి అలాంటి పనులు చేయాలంటే భయపడతాయి. అటువంటి ఘటనలను సాధారణంగా మనం సినిమాలలోనే చూసి ఉంటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అరాచక శక్తులను పోలీసులు అంతం చేస్తున్న వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. సహజంగానే చెడుపై మంచి విజయం సాధిస్తే దాని ప్రభావం సమాజం మీద తీవ్రంగా ఉంటుంది. పైగా దానిని సమాజం పాజిటివ్గా తీసుకుంటుంది. అటువంటి ఘటన ఒకటి ఇప్పుడు జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఆ వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం.. ఓ వ్యక్తి కాలికి కట్లు కట్టుకొని ఉన్నాడు. చేతికి కూడా కట్లు కట్టుకొని ఉన్నాడు. ఇద్దరు పోలీసులు అతడిని పట్టుకొని వస్తున్నారు. అతడేమీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కాదు. ప్రమాదవశాత్తు కింద పడిన వ్యక్తి అంతకంటే కాదు. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వ్యక్తి అసలే కాదు. ఆ వ్యక్తి పేరు అఖిల్. అతడు ఉండేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ప్రాంతంలో. మహిళల వరల్డ్ కప్ నేపథ్యంలో ఇటీవల ఆస్ట్రేలియా జట్టు ఇండోర్ ప్రాంతంలో మ్యాచ్ ఆడింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను అఖిల్ అసభ్యకరంగా తాకాడు. తాకడం మాత్రమే కాదు వారిని వేదించాడు కూడా. ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది. దీంతో పోలీసులు అఖిల్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు వారిదైన స్టైల్ లో ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. దీంతో అఖిల్ కు అసలు సినిమా అర్థమైంది. సినిమా అర్థమయ్యే లోపే అతని కాలికి గాయమైంది. కాకపోతే ఆ గాయం పోలీసులు చేసింది. పోలీసులు ఎందుకు చేశారో అఖిల్ కు తెలుసు.
దేశం పరువు తీసిన వ్యక్తికి పోలీసులు సరైన స్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చారని నెటిజన్లు అంటున్నారు.. వాస్తవానికి అఖిల్ చేసిన పని భారత దేశ పరువును తీసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉంటే అఖిల్ ఆ భద్రతను మొత్తం ఛేదించుకుని వెళ్ళాడు. ఆస్ట్రేలియా ప్లేయర్లపై దారుణంగా ప్రవర్తించాడు. వారిని అసభ్యకరంగా తాకాడు. దారుణమైన మాటలు మాట్లాడాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆ తర్వాత తమదైన శైలిలో సన్మానం చేశారు. దీంతో అఖిల్ కు చేసిన తప్పు గుర్తుకొచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఇంకోసారి ఇలాంటి పనులకు మరెవరూ పాల్పడకుండా పోలీసులు సరైన స్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చారు.
