Odi World Cup 2023- Pakistan
Odi World Cup 2023- Pakistan: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆసియా కప్ 2023 టోర్నీని పాక్‌లో నిర్వహించి, ఇండియా ఆడితేనే మేం వరల్డ్ కప్ ఆడతామని అంటోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే పీసీబీ బెదిరింపులకు బీసీసీఐ లొంగే ప్రసక్తే లేదు. అయితే పాకిస్తాన్‌లో భద్రతా కారణాలను సాకుగా చెబుతూ ఆసియా కప్ 2023 టోర్నీ వేదిక మార్చాల్సిందిగా పట్టుబడుతోంది బీసీసీఐ. భారత బోర్డు ఆదేశాలతో బంగ్లాదేశ్, శ్రీలంక కూడా పాక్ నుంచి ఆసియా కప్ 2023 టోర్నీని తరలించాల్సిదేనని పట్టుబడుతున్నాయి.
వరల్డ్ కప్ ఆడకుంటే భారీ జరిమానా..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంటే, నష్టపరిహారంగా రూ.200 మిలియన్ డాలర్లు (పాక్ కరెన్సీలో దాదాపు 5 వేల కోట్ల రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. దీంతో పాక్, ఇండియాకి రావడం దాదాపు ఖాయమే. ‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని అహ్మదాబాద్‌లో పెడుతున్నారనే వార్త వినగానే నవ్వొచ్చింది. మేం ఇండియాకి రాకుండా చేసేందుకు ఇది కూడా ఓ మార్గంగా అనిపించింది’ అని పీసీబీ చైర్మన్ నజం సేథీ పేర్కొన్నారు. కోల్‌కత్తా లేదా చెన్నై, హైదరాబాద్‌ల్లో మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉన్నా.. అహ్మదాబాద్‌లో కావాలనే పెట్టారనిపిస్తోంది అని తెలిపాడు.
సెక్యూరిటీ సమస్య అక్కడే ఎక్కువ..
రాజకీయాల గురించి నేను మాట్లాడను కానీ మాకు ఏ నగరంలో అయినా సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయంటే అది కచ్చితంగా అహ్మదాబాదే అని పీసీబీ చైర్మన్ ఆరోపించారు. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు, వాళ్లు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో అందరికీ తెలుసని పేర్కొన్నాడు. అహ్మదాబాద్‌కి వెళ్లి మ్యాచులు ఆడతాం అంటే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా వద్దంటుందని తెలిపాడు. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారో తెలిసి కూడా వెళ్తారా? అని ప్రశ్నిస్తుందని పేర్కొన్నాడు. దానికి మా దగ్గర సమాధానం లేదని వెల్లడించాడు. ‘నేను జైషాతో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అతను కూడా చాలా స్నేహపూర్వకంగా మాట్లాడాడు. అయితే అసలు సమస్య ఏంటంటే పాకిస్తాన్‌లో ఆడడానికి ఇండియాకి వచ్చిన సమస్య ఏంటో మాత్రం అతను చెప్పడం లేదు’ అని నజం సేథీ పేర్కొన్నాడు.
ప్రత్యామ్నాయంపై దృష్టి..
పాకిస్తాన్‌లో కాకపోతే ఇంగ్లాండ్‌లో లేదా యూఏఈలో ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. ఆసియా కప్‌పై క్లారిటీ వస్తే, వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల కానుంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Will pakistan play in odi world cup 2023 tournament or there is no clarity on the matter yet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com