BCCI: స్టార్ ఆటగాళ్లకు కష్టమేనా.. బీసీసీఐ ఇంత పని చేసిందేంటి?

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతోంది.బీసీసీఐ అంచనా వేసిన దాని కంటే 17వ సీజన్ అటు ఆటగాళ్లకు, ఇటు అభిమానులకు రసవత్తరమైన క్రికెట్ మజాను అందిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 11, 2024 10:13 am

BCCI

Follow us on

BCCI: కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్ ఇవ్వనుందా? ఐపీఎల్ లో కొత్త నిబంధనను తెరపైకి తీసుకురానుందా? దీంతో వారు వేలం నుంచి బయటికి వెళ్లే అవకాశం కనిపిస్తోందా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతోంది జాతీయ మీడియా. ఆ అంశాలకు సంబంధించి జాతీయ మీడియాలో కొద్దిరోజులుగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ కు సంబంధించి ఈ సంవత్సరం చివరిలో మెగా వేలం జరగనుంది.. ఈ వేలంలో జట్లను అట్టి పెట్టుకున్న(రి టైన్) ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు బీసీసీఐ ఆయా యాజమాన్యాల నుంచి ఒక సలహా కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చించేందుకు అహ్మదాబాదులో నిర్వహించే బోర్డు సమావేశానికి మొత్తం 10 జట్ల యాజమాన్యాలకు బీసీసీఐ ఆహ్వానాలు కూడా పంపింది.

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతోంది.బీసీసీఐ అంచనా వేసిన దాని కంటే 17వ సీజన్ అటు ఆటగాళ్లకు, ఇటు అభిమానులకు రసవత్తరమైన క్రికెట్ మజాను అందిస్తోంది. ఈ క్రమంలో ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసి.. వచ్చే సీజన్ లో డిమాండ్ ను అమాంతం పెంచుకోవాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. ప్రస్తుతం 17వ సీజన్ త్వరలో ముగియబోతున్న నేపథ్యంలో ఏడాది చివరిలో ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వహిస్తారు. ఈ వేళంలో ప్రతి జట్టు స్వరూపం పూర్తిగా మారుతుంది. అంతేకాదు కీలక ఆటగాళ్లు మెగా వేలంలో కనిపించరు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

జాతీయ మీడియా లో వస్తున్న వార్తల ప్రకారం ఈ ఏడాది చివరిలో ఐపీఎల్ మెగా వేలం జరుగుతుంది. ఈ వేలంలో ఆయా జట్లను అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నిర్ణయం ప్రాథమిక దశలో ఉన్న నేపథ్యంలో.. బీసీసీఐ తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది త్వరలోనే తేలనుంది. ఐపీఎల్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. అయితే చాలావరకు జట్ల యాజమాన్యాలు వేలానికి ముందు ఎనిమిది మంది కీలకమైన ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకునేందుకు అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది.బీసీసీఐ తీసుకొనే నిర్ణయం పట్ల స్టార్ ఆటగాళ్లు సుముఖంగా ఉంటారా? లేకుంటే వ్యతిరేకిస్తారా? ఈ నిర్ణయాన్ని తెరపైకి తీసుకువచ్చిన బీసీసీఐ.. యాజమాన్యాలు కాకుండా ఆటగాళ్లతో సంప్రదింపులు జరిపిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. వీటిపై బీసీసీఐ వర్గాలు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అహ్మదాబాద్ లో జరిగే బీసీసీఐ బోర్డు సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.