Nitish Rana: ఈ ఐపీఎల్ ప్రారంభంలో ఏమాత్రం అంచనాలు లేని జట్టు కోల్ కతా.. కానీ అందరి అంచనాలను ఆ జట్టు తలకిందులు చేస్తోంది. మొన్నటిదాకా పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో కొనసాగింది.. ఇటీవల చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ ఓడిపోయింది గాని.. లేకుంటే రాజస్థాన్ జట్టును బీట్ చేసి మొదటి స్థానంలో కొనసాగిదే. ఈ సీజన్లో ఇప్పటివరకు కోల్ కతా జట్టు ప్రదర్శన బాగుంది. ఇప్పటివరకు నాలుగు లీగ్ మ్యాచ్లు ఆడిన కోల్ కతా.. మూడింట గెలిచింది.
చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన కోల్ కతా ఓ శుభవార్త అందుకుంది. గాయం కారణంగా ఇప్పటివరకు ఒకటే మ్యాచ్ ఆడిన ఆ జట్టు స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ నితీష్ రాణా మళ్లీ కోల్ కతా జట్టులోకి వచ్చాడు. ఈడెన్ గార్డెన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్లో అతడు గాయపడ్డాడు. దీంతో అతను కోల్ కతా లోని శిబిరంలో చికిత్స నిమిత్తం చేరాడు.. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నితీష్ 11 బాల్స్ ఎదుర్కొని 9 పరుగులు చేశాడు. బ్యాటింగ్ అనంతరం ఫీల్డింగ్ చేస్తుండగా అతని చేతికి గాయమైంది. రాణా చెయ్యి వేలు విరిగింది. ఫలితంగా బెంగళూరు, ఢిల్లీ, చెన్నై జట్లతో జరిగిన మ్యాచ్ లకు అతడు దూరమయ్యాడు.
ఇక గత సీజన్లో అయ్యర్ లేకపోవడంతో కోల్ కతా జట్టుకు రాణా కెప్టెన్ గా ఉన్నాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు రానా 106 మ్యాచులు ఆడాడు. 2,603 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాణా ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్ లు ఆడాడు. 3 హాఫ్ సెంచరీలతో 413 రన్స్ చేశాడు. అదే రాణా ఎంట్రీ కోల్ కతా జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఎందుకంటే ఈ జట్టులో బ్యాటింగ్ విభాగం పూర్తిగా హౌస్ ఫుల్ అయిపోయింది. జట్టులో ఆడుతున్న వారంతా బ్యాటింగ్లో రాణిస్తున్నారు. కాబట్టి 11వ ఆటగాడిగా రాణా ను ఆడించడం కోల్ కతా జట్టు యాజమాన్యానికి పెద్ద ఇబ్బందిగా మారింది. అదే అతనిని జట్టులోకి తీసుకున్నప్పటికీ.. మైదానంలో ఆడే స్క్వాడ్ లో చేర్చక పోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.