IND vs BAN : మహమ్మద్ షమీ (53/5), హర్షిత్ రాణా(31/3), అక్షర్ పటేల్ (43/2) అదరగొట్టారు. హార్దిక్ పాండ్యా, కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. హార్దిక్ పాండ్యా 5, కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజా కూడా 4 కంటే ఎక్కువ ఎకానమీ నమోదు చేశారు. వాస్తవానికి ఐదు వికెట్లు వెంట వెంటనే కోల్పోయిన బంగ్లాదేశ్.. ఆరో వికెట్ కు మాత్రం 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. హృదయ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. జాకీర్ అలీ 68 పరుగులు చేశాడు. వాస్తవానికి వీరిద్దరిని అవుట్ చేయడానికి టీమ్ ఇండియా బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. వీరిని అవుట్ చేసేందుకు వచ్చిన మూడు అవకాశాలను టీమిండియా ప్లేయర్లు వదిలేయడం విశేషం. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ నిర్లక్ష్యమైన ఫీల్డింగ్ వల్ల హృదయ్, జాకీర్ అలీ పండగ చేసుకున్నారు. ఏకంగా 154 పరుగుల భాగస్వామ్యాన్ని ఆరో వికెట్ కు నెలకొల్పారు.
వారిని కనుక ఆడించి ఉంటే
ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అర్ష్ దీప్, వరుణ్ చక్రవర్తి ని రిజర్వ్ బెంచుకు పరిమితం చేశాడు. ఒకవేళ గనుక వీరిద్దరిని ఆడించుకుంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ముఖ్యంగా రవీంద్ర జడేజా స్థానంలో అర్ష్ దీప్, కులదీప్ యాదవ్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని కనుక ఆడించి ఉంటే బంగ్లా జట్టు ఆట 100 పరుగుల వద్ద ముగిసి ఉండేది.. ఎందుకంటే ఇటీవలి సిరీస్లలో అర్ష్ దీప్, వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ప్రతిభ చూపించారు. ముఖ్యంగా టి20 లలో అదరగొట్టారు. అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం పాకిస్తాన్ తో ఆదివారం జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం వీరిద్దరికీ విశ్రాంతి ఇచ్చినట్టు తెలుస్తోంది. అర్ష్ దీప్, వరుణ్ చక్రవర్తి మ్యాజికల్ పంతులు వేయగలరు. పైగా దుబాయ్ మైదానంలో వీరు బంతిపై మరింత పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది. అందువల్లే కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ కోసం వీరికి విశ్రాంతి ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఎందుకంటే అర్ష్ దీప్, వరుణ్ చక్రవర్తి బంతులతో మ్యాజిక్ చేయగలరు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్లు స్పిన్నర్ల బౌలింగ్ లోనే తడబడ్డారు. ఓరూర్కే, సాంట్నర్ బౌలింగ్లో వికెట్లను పారేసుకున్నారు. అర్ష్ దీప్, వరుణ్ చక్రవర్తి కూడా వారి మాదిరిగానే బౌలింగ్ వేయగలరు. అందువల్లే పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ కోసం వీరికి విశ్రాంతి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరి పాక్ తో జరిగే మ్యాచ్ లో వీరు ఎలాంటి ప్రతిభ చూపుతారో వేచి చూడాల్సి ఉంది.