IND vs BAN : ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో టీమిండియా బౌలర్లు అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. కానీ ఫీలింగ్ విషయంలో మాత్రం దారుణంగా నిరాశపరిచారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు జీవదానాలు ఇచ్చారు. అయితే ఈ మూడు తప్పులు కూడా సీనియర్ ఆటగాళ్లు చేయడం విశేషం. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా బంగ్లా బ్యాటర్లకు కొత్త ఊపిరి అందించారు. దీంతో చేతులకు ఏమైనా ఆముదం పూసుకొని వచ్చారా.. అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బంగ్లాదేశ్ 9 ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి క్యాచ్ వదిలేశాడు. వాస్తవానికి చేతుల్లోకి వచ్చిన బంతిని అతడు వదిలేశాడు. ఒకవేళ గనుక ఆ క్యాచ్ పట్టుకొని ఉంటే బంగ్లాదేశ్ 228 పరుగులు చేసేది కాదు.. అక్షర పటేల్ బౌలింగ్లో ఫస్ట్ స్థితిలో జాకీర్ అలీ ఇచ్చిన క్యాచ్ ను రోహిత్ శర్మ అలా పట్టుకొని ఇలా వదిలేసాడు. అలా వదిలేసినందుకు తనకు తానే శిక్ష విధించుకున్నాడు. క్యాచ్ వదిలేసిన అనంతరం మైదానాన్ని తన చేతులతో నేలకు కొట్టాడు.
రోహిత్ అనంతరం హార్దిక్ పాండ్యా కూడా క్యాచ్ వదిలేసి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. కులదీప్ యాదవ్ బౌలింగ్లో తౌహిద్ హృదయ్ ఇచ్చిన క్యాచ్ ను హార్థిక్ పాండ్యా నేలపాలు చేశాడు. వాస్తవానికి అది అత్యంత సులభమైన క్యాచ్. కానీ దానిని అందుకోలేక హార్దిక్ విఫలమయ్యాడు.. అయితే రోహిత్, హార్దిక్ క్యాచ్ లు వదిలేసిన ప్లేయర్లు శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.
బంగ్లాదేశ్ 23 ఓవర్లో జాకీర్ అలీ మరో అవకాశం ఇచ్చాడు. దానిని కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. జాకిర్ ఆలీ ని స్టంప్ చేసే అవకాశాన్ని కేఎల్ రాహుల్ మిస్ చేశాడు. అయితే ఇలా వరుసగా మూడు జీవధానాలు లభించడంతో బంగ్లా ఆటగాళ్లు సద్వినియోగం చేసుకున్నారు.. 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఒకానొక దశలో 100 పరుగులకే కుప్పకూలి పోతుందని అందరూ అనుకున్నారు. కానీ జాకీర్ ఆలీ(68), హృదయ్ (100) 154 పరుగుల భాగస్వామ్యాన్ని ఆరో వికెట్ కు నెలకొల్పారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. 189 పరుగుల వద్ద జాకీర్ అలీ రూపంలో ఆరో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మిగతా వికెట్లు వెంట వెంటనే నేల కూలడంతో బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది.
If you want to abuse rohit sharma here is the video :pic.twitter.com/FC7yPqHDcD
— Rathore (@exBCCI_) February 20, 2025