iPhone 16e
iPhone 16e: ఐఫోన్.. దీనిని స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. అప్పు చేసైనా సరే ఆ ఫోన్ కొనాల్సిందే అంటుంది ఈ నాటి యువత. లక్షలు ఖర్చు పెట్టడానికి కారణం అందులో ఉన్న ఫీచర్లు.. ఆ కంపెనీకి ఉన్న బ్రాండ్. అలాంటి టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త ఫోన్ ను రిలీజ్ చేసింది. ఐఫోన్ 16ఈ (Iphone 16e)ని భారత మార్కెట్‌లోకి ఇంట్రడ్యూస్ చేసింది. అదే సమయంలో తన స్టోర్ నుంచి ఐఫోన్ ఎస్‌ఈని తొలగించింది. ఎట్టకేలకు యాపిల్ కంపెనీ భారతదేశంలో తన అఫార్డిబుల్ ఐఫోన్ని ప్రటించింది. దీనిని ఐఫోన్ 16ఈ అని పిలుస్తున్నారు. ఇది ఎస్ఈ ట్యాగ్ని మర్చిపోయేలా చేసింది. ఐఫోన్ 16ఈ చాలా కాలంగా చర్చల్లో ఉంది. ఇప్పుడు ఫ్లాగ్షిప్ మోడళ్ల కంటే చాలా తక్కువ ధరకు మంచి ఫీచర్లతో ఈ ఫోన్ ఎక్కువ మంది కొనుగోలు చేసే విధంగా కంపెనీ తీసుకొచ్చింది. దీని ధర కూడా మిడిల్ క్లాస్ వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా చేసింది. గతంతో పోలిస్తే మరింత మంది యూజర్లకు చేరువయ్యే లక్ష్యంతో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ను యాపిల్ కంపెనీ రిలీజ్ చేస్తుంది.
ఐఫోన్ 16ఈ ఫోన్ ఐఫోన్ 14 తరహా డిజైన్ ను పోలి ఉంటుంది. గ్లాస్ బిల్డ్ ఉన్న ఈ ఫోన్ ముందు భాగంలో సిరామిక్ షీల్డ్తో ప్రొటెక్ట్ ఇస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్లో ఐపీ68 రేటింగ్ కూడా లభించింది. ఐఫోన్ 16ఈలో ఓఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన 6.1 అంగుళాల ఓఎల్ ఈడీస్ర్కీన్(సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్ప్లే)ని అందించారు. ట్రూ డెప్త్ కెమెరా సిస్టమ్ తో ఫేస్ ఐడీ, యూఎస్ బీ సీ పోర్ట్, యాక్షన్ బటన్ వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. ఏ18 చిప్‌ను ఈ ఫోన్ లో అమర్చారు. ఏఐ ఫీచర్లు ఈ కొత్త మోడల్‌కు సైతం సపోర్ట్ చేస్తాయి. బ్యాక్ 48 ఎంపీ కెమెరా.. సెల్ఫీల కోసం ఫ్రంట్ 12 ఎంపీ కెమెరా ఇచ్చారు. 18 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ ఆఫ్షన్ కూడా ఉంటుంది. శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్లను కూడా జోడించారు. ఐఓఎస్ 18పై ఇది వర్క్ చేస్తుంది.
ఇక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే ఈ కొత్త మోడల్… మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. బేస్ మోడల్ లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. దీని ధర రూ.59,900గా నిర్ణయించారు. తర్వాత 256 జీబీ వేరియంట్ ధర రూ.69,900గా, 512 జీబీ వేరియంట్ ధర రూ.89,900గా నిర్ణయించారు. ఫిబ్రవరి 21 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్, 28 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. బ్లాక్, వైట్ కలర్లలో ఈ మోడల్ ఫోన్లను తీసుకొచ్చారు.