IND vs SL: మ్యాచ్ టై.. ఐనా సూపర్ ఓవర్ ఎందుకు నిర్వహించలేదు? కారణం ఇదే?

సూపర్ ఓవర్ నిర్వహించకపోవడానికి కారణాలు స్పష్టంగా చెప్పలేక పోయినప్పటికీ.. కొలంబోలోని ప్రేమదాస మైదానం నిర్జీవంగా ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : August 2, 2024 10:46 pm

IND vs SL

Follow us on

IND vs SL : మూడు టీ -20 మ్యాచ్ ల సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తర్వాత.. శుక్రవారం టీమిండియా శ్రీలంకతో కొలంబో వేదికగా తొలి వన్డే మ్యాచ్ ఆడింది. రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా శ్రీలంకతో తలపడింది. కొలంబో లోని ప్రేమ దాస స్టేడియంలో తొలి మ్యాచ్ జరగగా..ఇది టైగా ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 230 పరుగులు చేసి.. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత జట్టును 230 పరుగులకే కట్టడి చేసింది.. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 230 రన్స్ చేయగా, అనంతరం 231 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 47.5 ఓవర్లలో 230 రన్స్ కు అలౌట్ అయింది. వాస్తవంగా ఈ మ్యాచ్ టై అయ్యింది అనేదానికంటే.. టీమిండియా చేజేతులా విజయాన్ని దూరం చేసుకుంది అనడం సబబు. ఒకానొక దశలో 188 /5 స్థితిలో ఉన్న టీమిండియా.. చివరి ఐదు వికెట్లను 42 పరుగుల వ్యవధిలో కోల్పోవడం విశేషం. కీలక సమయాల్లో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మైదానం మందకొడిగా ఉండడం కూడా శ్రీలంక బౌలర్లకు కలిసి వచ్చింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

సూపర్ ఓవర్ నిర్వహించలేదు

ఇటీవల టీమిండియా శ్రీలంకతో మూడవ టి20 మ్యాచ్ ల సిరీస్లో చివరి మ్యాచ్ ఆడినప్పుడు.. ఆ మ్యాచ్లో టీమిండియా -శ్రీలంక జట్ల స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో టీమిండియా బౌలర్ వాషింగ్టన్ సుందర్ కేవలం మూడు పరుగులు మాత్రమే రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం నాలుగు పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన భారత్ జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పుట్టిన అద్భుతమైన షాట్ బౌండరీ వెళ్ళింది. దీంతో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఫలితంగా మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే 3 వన్డేల సిరీస్ లో.. తొలి మ్యాచ్ లో శ్రీలంక, భారత జట్ల స్కోర్లు సమం అయ్యాయి. అయితే ఎంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించబోమని స్పష్టం చేశారు.

అయితే సూపర్ ఓవర్ నిర్వహించకపోవడానికి కారణాలు స్పష్టంగా చెప్పలేక పోయినప్పటికీ.. కొలంబోలోని ప్రేమదాస మైదానం నిర్జీవంగా ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వాస్తవంగా రెండు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహిస్తారని అందరూ అనుకున్నారు. సోషల్ మీడియాలోనూ సూపర్ ఓవర్ ప్రస్తావన హోరెత్తింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించకుండానే మ్యాచ్ టై గా ముగిసిందని ప్రకటించారు. ఒకవేళ సూపర్ ఓవర్ నిర్వహిస్తే మూడవ టి20 మ్యాచ్లో ఫలితమే రిపీట్ అయ్యేదని టీమిండియా అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తే.. ఈసారి ఫలితం మరో విధంగా వచ్చేదని శ్రీలంక అభిమానులు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి రెండు జట్లకు చెందిన అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. అయితే చివర్లో భారత టెయిల్ ఎండర్లు కులదీప్ యాదవ్ (2), మహమ్మద్ సిరాజ్ (5) అర్ష్ దీప్ సింగ్(0) వల్లే భారత్ ఓడిపోయిందని నెట్టింట తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీరి ముగ్గురిలో ఎవరైనా సరిగ్గా ఆడి ఉంటే భారత్ గెలిచేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరో ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ఐదు పరుగులకే అవుట్ కావడంతో.. అతనిపై కూడా నెటిజెన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.