IND vs SL : శ్రీలంక అనూహ్య పోరాటం.. చివర్లో భారత్ తడబాటు.. రోమాలు నిక్కబొడిచేలా చేసిన మ్యాచ్ ఇది

భారత జట్టు 189 నుంచి 230 రన్స్ వ్యవధిలో చివరి 4 వికెట్లు కోల్పోవడం విశేషం.. శ్రీలంక బౌలర్లలో హసరంగ, అసలంక చెరో మూడు, వెల్లాలగే రెండు, ధనుంజయ , అసిత చెరో వికెట్ దక్కించుకున్నారు.

Written By: NARESH, Updated On : August 2, 2024 10:30 pm

Ind vs slInd vs sl

Follow us on

IND vs SL : టీ -20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆనందం టీమ్ ఇండియాది.. స్వదేశంలో టి20 సిరీస్ కోల్పోయిన బాధ శ్రీలంక ది. టి20 సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో.. ఆ బాధను వన్డే సిరీస్ ద్వారా భర్తీ చేయాలని ఆలోచన శ్రీలంక జట్టుకుంది. ఇందులో భాగంగానే అనేక శక్తియుక్తులతో వన్డే సిరీస్ లోకి అడుగుపెట్టింది. కొలంబో వేదికగా శుక్రవారం టీమ్ ఇండియాతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియాను వణికించింది. చేసిన 230 పరుగుల స్వల్ప స్కోర్ ను కాపాడుకొని మ్యాచ్ టై కి దారి తీసేలా చేసింది. టీమిండియా కెప్టెన్ మెరుపు అర్ధ సెంచరీ చేసినప్పటికీ.. మిగతా ఆటగాళ్లను కీలక సమయాల్లో అవుట్ చేసి శ్రీలంక బౌలర్లు మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. ఇటీవల టి20 సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీయగా.. మొదటి వన్డేలో అసాధారణ ప్రదర్శన చేసి శ్రీలంక బౌలర్లు ఆకట్టుకున్నారు.

ముందుగా బ్యాటింగ్ చేసి

శ్రీలంక జట్టు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వెల్లలాగే 67, ఓపెనర్ నిస్సాంక 75 బంతుల్లో 56 పరుగులు చేసి టాప్ స్కోరర్లు గా నిలిచారు. మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 రన్స్ చేసింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, శివం దూబే, కులదీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ వేయించడం విశేషం. ఈ మైదానం మందకొడిగా ఉండడంతో శ్రీలంక జట్టు పవర్ ప్లే లో 37 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఏడు పరుగుల పై ఓపెనర్ ఔట్

జట్టు స్కోరు ఏడు పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ అవిష్కా ఫెర్నాండోను మహమ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత శ్రీలంక జట్టు భారాన్ని నిస్సాంక భుజాలకు ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో కుశాల్ (14), సమర విక్రమ (8), కెప్టెన్ అసలంక (14), లియానగే(20), హసరంగ (24), ధనుంజయ (17), మహమ్మద్ షిరాజ్(1) పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. వీరి వద్ద నుంచి శ్రీలంక అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశించినప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అయితే కీలక సమయంలో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేసి, శ్రీలంక భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయగలిగారు.

రోహిత్ దూకుడు

231 రన్ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా… కెప్టెన్ రోహిత్ శర్మ (58) దూకుడుతో తొలి వికెట్ కు మెరుగైన ఆరంభం లభించింది..గిల్ – రోహిత్ కలిసి తొలి వికెట్ కు 75 పరుగులు జోడించారు. నీతో టీమిండియా విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ ఈ దశలో గిల్(16), రోహిత్ ఐదు పరుగుల వ్యవధిలో అవుట్ కావడంతో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. ఇదే దశలో రంగంలోకి దిగిన వాషింగ్టన్ సుందర్ ఐదు పరుగులకే అవుట్ కావడంతో టీమ్ ఇండియా కష్టాలు మరింత పెరిగాయి. విరాట్ కోహ్లీ (24) కేఎల్ రాహుల్ (31), శ్రేయస్ అయ్యర్ (23) దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ కావడంతో టీమిండియా కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇదే సమయంలో అక్షర్ పటేల్ (33), శివం దుబే (25) సమయోచితంగా బ్యాటింగ్ చేసినప్పటికీ కీలక సమయంలో అవుట్ కావడంతో టీమిండియా కష్టాలు పెరిగాయి.. ఇదే సమయంలో కులదీప్ యాదవ్ (5), అర్ష్ దీప్ సింగ్(0) అవుట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

చివరి ఓవర్లలో అద్భుతం..

చివరి ఓవర్లలో హసరంగ, అసలంక అద్భుతంగా బౌలింగ్ వేశారు. కేఎల్ రాహుల్, కులదీప్ యాదవ్ వికెట్లను హసరంగ తీయగా.. అక్షర్ పటేల్, శివం దుబే వికెట్లను అసలంక పడగొట్టాడు. భారత జట్టు 189 నుంచి 230 రన్స్ వ్యవధిలో చివరి 4 వికెట్లు కోల్పోవడం విశేషం.. శ్రీలంక బౌలర్లలో హసరంగ, అసలంక చెరో మూడు, వెల్లాలగే రెండు, ధనుంజయ , అసిత చెరో వికెట్ దక్కించుకున్నారు.