Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. శనివారం సందర్భంగా ధనస్సు, మీన రాశి వారిపై శనిదేవుడి ఆశీస్సులు ఉంటాయి. ఆర్థికంగా వీరు పుంజుకుంటారు. మరికొన్ని రాశుల వారు ఆందోళనతో ఉంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతమవుతాయి.
వృషభ రాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు పెండింగులో ఉంచడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. అనవసర వాదనలకు దిగొద్దు. పాత స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
మిథున రాశి:
కొన్ని అనవసర విషయాలకు దూరంగా ఉండడమే మంచిది. విద్యార్థులు కెరీర్ ను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలనుకునేవారు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. వ్యాపారులు కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు. కొత్త పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి. సాయంత్రం ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.
సింహారాశి:
వ్యాపారులు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఏదైనా వివాదం ఏర్పడితే వాటికి దూరంగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి:
శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఉద్యోగులు కార్యాయాల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. శత్రువుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
తుల రాశి:
పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పాత స్నేహితులను కలుస్తారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. ప్రత్యర్థుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి విలువైన బహుమతిని అందిస్తారు.
వృశ్చిక రాశి:
వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేస్తారు. అనవసరమైన పనులకు దూరంగా ఉండాలి. వివాహ ప్రయత్నాల్లో బిజీగా ఉంటారు. సాయంత్రం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల భవిష్యత్ పై తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.
ధనస్సు రాశి:
తల్లిదండ్రుల సలహాతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఈరోజు ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంలో కొన్ని వివాదాలు ఏర్పడుతాయి. అయితే చాకచక్యంగా వాటిని పరిష్కరించుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనడం ద్వారా విజయం సాధిస్తారు.
మకర రాశి:
వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం. అనుకోని ధనం వస్తుంది. కొత్త ఒప్పందాలు చేసుకంటారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని భారీగా పెట్టుబడులు పెడుతారు. బంధువుల నుంచి కొత్త సమాచారం సేకరిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కుంభరాశి:
ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. సాంకేతిక రంగంలో పనిచేసేవారికి ప్రమోషన్లు ఉంటాయి. పూర్వీకుల ఆస్తిలో లాభం పొందుతారు. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి:
ఉద్యోగులు కొన్ని బాధ్యతలు పూర్తి చేస్తారు. ఆకస్మికంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. చిన్న పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో నిరాశతో ఉంటారు. వ్యాపారులకు అనుకున్న ప్రయోజనాలు ఉండవు. కొత్త వ్యక్తులను నమ్మొద్దు.