T20 World Cup: పాకిస్తాన్ జట్టులో మార్పులు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు విజయాలు నమోదు చేయని జట్టు ఇప్పుడు హఠాత్తుగా కోలుకుని సంచలనం సృష్టించడం చూస్తుంటే ఇది ఒక రోజులో జరిగింది కాదని స్పష్టమవుతోంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించే ఆటగాళ్లు చేరడం కలిసొచ్చే అంశమే. కానీ 90వ దశకంలో పాకిస్తాన్ జట్టు కూర్పు ఎలా ఉందో అలాంటి లక్షణాలే ఇప్పుడు జట్టులో కనిపిస్తున్నాయని క్రీడా విశ్లేషకుల వాదన. అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలో పాక్ జట్టు ఎన్నో విజయాలు సాధించి 1992లో ప్రపంచ కప్ సాధించడం తెలిసిందే.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయ కారణాలతో పరిస్థితి పట్టు తప్పిపోయినా ప్రస్తుతం దాని ముప్పు లేకుండా చేసుకుంటోంది. 2007 ప్రపంచ కప్ లో వైఫల్యం చెందినా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పదునైన క్రికెటర్లు జట్టులోకి వస్తన్నారు. దీంతో జట్టు పటిష్టంగా తయారయింది. దీంతో విజయాలను నిర్దేశం చేసే స్థాయికి జట్టు చేరుకుంది. ఇందులో భాగంగానే ఇండియాతో జరిగిన మ్యాచ్ లో జట్టు విజయవంతమైన ప్రదర్శన చేసి విజయం అందుకుంది.
టీ 20 ప్రపంచకప్ లో భారత్ పై పాకిస్తాన్ ప్రదర్శన మెరుగ్గా ఉంది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రత్యర్థి జట్టు వికెట్ కోల్పోకుండా విజయం సాధించడం చూస్తుంటే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు కనిపిస్తోంది. మరోవైపు న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 69 పరుగులకే 4 వికెట్లు పడినా పాక్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించడం గమనార్హం.
జట్టు కూర్పులో సమర్థవంతమైన ఆటగాళ్లుండటంతో పాకిస్తాన్ ఇంత కసిగా ఆడటంపై అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. టీ 20 ప్రపంచ కప్ లో ఆ జట్టు తీరు ఉత్తమమైన ప్రదర్శన కనబరుస్తోంది. వచ్చే మ్యాచుల్లో కూడా ఇలాగే ఆడి నెంబర్ వన్ జట్టుగా నిలుస్తుందేమోనని అందరిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.