MS Dhoni: అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి.. వృద్ధాప్యంతో బతికీడుస్తున్న వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అత్యవసరంగా మారిపోయింది. ప్రస్తుత ప్రపంచమంతా స్మార్ట్ గా ఉంది. స్మార్ట్ ఫోన్ చేతిలో లేకుండా ఏ పని చేయలేని పరిస్థితికి ప్రజలు చేరిపోయారు. స్మార్ట్ ఫోన్ వాడని వారు ఎవరైనా కనిపిస్తే.. ఇంకా ఏ కాలంలో ఉన్నావు బాబు అంటూ వెటకారం ఆడే పరిస్థితి ఉంది. అతి కొద్దిమంది మాత్రమే స్మార్ట్ ఫోన్ కు దూరంగా తమ జీవితాలను గడుపుతున్నారు. అదే కోవలోకి వస్తారు టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని. స్మార్ట్ ఫోన్ ను పెద్దగా ధోని పెద్దగా వాడడట.
చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ పని చేయలేని పరిస్థితి. అనేక వ్యవహారాలను ఈ స్మార్ట్ ఫోన్ తోనే నిర్వహించేందుకు అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అన్ని అనర్ధాలు కూడా ఉన్నాయి. ఉపయోగాలు గురించి ఎక్కువగా చూస్తున్న ప్రజలు అనర్ధాలు గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. కారణాలు ఏవైనా అతి కొద్ది మంది మాత్రమే స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్ ను సమాచారాన్ని చేరవేతకు మాత్రమే వినియోగిస్తున్నారు మిగిలిన వ్యవహారాలను స్మార్ట్ ఫోన్ తో అస్సలు నడపరు. అటువంటి వారిలో టీమిండియా మాజీ సారథి, ఐపీఎల్ లో చెన్నై జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్న మహేంద్రసింగ్ ధోని ఒకరు. స్మార్ట్ ఫోన్ ను పెద్దగా వినియోగించేందుకు ధోని ఇష్టపడడట. గతంలో ఇదే విషయాన్ని విరాట్ కోహ్లీ బయట ప్రపంచానికి తెలియజేశాడు.
ఫోన్ ఎక్కువ వినియోగించకపోవడం వల్లే.. కాల్స్ లిఫ్ట్ చేయడు..
ధోని దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ పెద్దగా దానిని వినియోగించడు. ఫోన్ కు దూరంగానే ఉంటాడు. ఇదే విషయాన్ని విరాట్ కోహ్లీ తెలియజేశాడు. ‘ నేను మాట్లాడదామనుకొని ధోనీకి కాల్ చేస్తే.. 99% ధోని లిఫ్ట్ చేయడు. ఎందుకంటే ధోని పెద్దగా ఫోన్ వాడడు’ అని కోహ్లీ చెప్పాడు. ఫోన్ తో సమయాన్ని నడపడం కంటే కుటుంబంతో ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి ప్రాధాన్యతనిస్తాడు ధోని. అందుకే స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకోడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో..
ధోని ఫోన్ వాడడని తెలిపే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు అందరూ ఓ బస్సులో స్టేడియం దగ్గరకు వచ్చారు. బస్సు దిగిన వెంటనే క్రికెటర్లు అందరూ తమ మొబైల్ ఫోన్లను ఒక బాక్స్ లో పెట్టేస్తున్నారు. అయితే ధోని మాత్రం ఆ బాక్స్ లో ఏమీ పెట్టలేదు. ధోని మొబైల్ క్యారీ చేయడు కాబట్టే ఆ బాక్సు దగ్గరకు వెళ్లకుండా నేరుగా వెళ్లిపోయాడని నెట్టిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు అభిమానులు. స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా బతకలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉంటున్నారని, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే అంతవరకు స్మార్ట్ ఫోన్ చేతులో ఉంటే గాని ప్రశాంతంగా ఉండలేని వారు ఎందరో ఉన్నారని, అటువంటి సమాజంలో ఉన్న ధోనీ మాత్రం స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండడం గొప్ప విషయం అని పలువురు పేర్కొంటున్నారు. స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండటం వల్లే మాస్టర్ మైండ్ ధోని ఆలోచనలు భిన్నంగా ఉంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ధోని స్మార్ట్ ఫోన్ వాడకపోవడంపై మీరు ఏమనుకుంటున్నారో చెప్పేయండి.