India Vs West Indies 1st T20: వెస్టిండీస్ రూర్‌లో ఉన్న భారత జట్టు ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్ నెగ్గింది. టీ20 సిరీస్ గురువారం నుంచి ప్రారంభమైంది. టెస్ట్, వన్డే సిరీస్‌లో పేలవ ఆటతీరుతో ఓటమి మూటగట్టుకున్న విండీస్.. టీ20లో మాత్రం.. కుర్రాళ్లు రాణించారు. దీంతో మొదటి మ్యాచ్‌లో భారత్‌కు పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో విండీస్ 150 పరుగుల టార్గెట్‌ను భారత్ ముందు ఉంచింది. లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఇక చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం విండీస్‌నే వరించింది. అయితే చివరి ఓవర్‌లో టెయిలెండర్ల బ్యాటింగ్ విషయంలో గంగరగోళం కనిపించింది.
వారించిన బ్యాటింగ్‌కు వెళ్లిన చహల్..
మ్యాచ్ 20వ ఓవర్‌లో ఓవర్ తొలి బంతికి కుల్దీప్ యాదవ్ రొమారియో షెపర్డ్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెక్ట్స్ ప్లేస్ చహల్‌దే. ఈమేరక సిద్ధంగా ఉన్నాడు చహల్. అప్పటికి 5 బందుల్లో పది పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. 19వ ఓవర్‌లో రెండు బౌండరీలతో భారత్ విన్నింగ్ ఆశలు సజీవంగా నిలిపిన అర్ష్‌దీప్ సింగ్ నాన్‌స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉన్నాడు. కుల్దీప్ ఔటై పెవిలియన్‌కు వెళుతుండగా, వాక్డ్‌లో చాహల్ అంతా సన్నద్ధమయ్యారు. అయితే కోచ్ రాహుల్ ద్రవిడ్ మరియు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరంగేట్ర ఆటగాడు ముఖేష్ కుమార్‌ను నంబర్ 10 వద్ద బ్యాటింగ్ చేయాలనుకుంటున్నారు. కానీ చహల్ అప్పటికే మైదానంలో అడుగు పెట్టాడు. డగౌట్ నుంచి వచ్చే శబ్దంతో కలవరపడ్డ చాహల్, ముఖేష్ మైదానంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతను అలా అనుమతించలేదు. ఆట నిబంధనల ప్రకారం.. ఒకసారి ఒక బ్యాటర్ ఒక వికెట్ పడిపోయినప్పుడు మైదానంలోకి అడుగుపెడితే, అతను వెనక్కి వెళ్లి మరొకరిని పంపలేడు. చాహల్ మళ్లీ మధ్యలోకి దూసుకెళ్లాల్సి వచ్చింది.
ఒక్క పరుగుకే ఔట్..
అయితే బ్యాటింగ్‌కు దిగిన చహల్ తన మొదటి బంతికి సింగిల్ చేసి ఔటయ్యాడు. అర్ష్‌దీప్ బ్యాటింగ్ చాన్స్ వచ్చినా బౌండరీలు కొట్టలేకపోయాడు. చివరి బంతికి రనౌట్ అయ్యాడు. ఇక 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ముఖేష్ చివరి బంతికి సిక్స్ కొట్టాడు. కానీ అప్పటికే మ్యాచ్ చేజారింది. ముఖేష్ 10వ ష్టానంలో బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేదని టీమిండియా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
ముఖేష్‌ను పంపినా..
చాహల్ కంటే ముందుగా ముఖేష్‌ను పంపి ఉంటే పరిస్థితులు పెద్దగా మారకపోవచ్చు. ఎందుకంటే రైట్ ఆర్మ్ పేసర్ బ్యాట్‌తో బంతితో ఉపయోగపడేంతగా ఎక్కడైనా ఉపయోగపడతాడని సూచించడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. కానీ కచ్చితంగా భారతీయ థింక్ ట్యాంక్ దానిని ప్లాన్ చేసి ఉండవచ్చు.
చహల్ రికార్డు అంతంతే..
యుజ్వేంద్ర చాహల్ బ్యాటింగ్‌లో చాలా పూర్. ఈ భారత లెగ్ స్పిన్నర్ తన మొత్తం టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు. అతను అన్ని ఫార్మాట్లలో ఇప్పటి వరకు 802 పరుగులు మాత్రమే చేశాడు. కాబట్టి చాహల్ బ్యాటింగ్‌పై కోచ్, కెప్టెన్ సందేహించడం సరైందే. కానీ చిన్న కన్ఫ్యూజన్.. చహల్‌ను బ్యాటింగ్‌కు వెళ్లేలా చేసింది.