https://oktelugu.com/

Annamayya District: మొదటి భార్యను చంపిన రెండో భార్య ఫ్యామిలీ.. అధ్యాపకురాలీ దారుణ హత్యలో మరో కోణం

మదనపల్లె శివాజీ నగర్ కు చెందిన కదిర్ అహ్మద్ విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య రుక్సానా ఉంది. వీరికి ఆరేళ్ల కిందట వివాహమైంది.

Written By:
  • Dharma
  • , Updated On : August 4, 2023 / 01:28 PM IST

    Annamayya District

    Follow us on

    Annamayya District: భర్త చేసిన తప్పిదానికి భార్య మూల్యం చెల్లించుకుంది. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.భార్య ఉండగా.. రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కోపంతో.. మొదటి భార్యను అతి కిరాతకంగా చంపేసారు రెండో భార్య కుటుంబ సభ్యులు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగింది ఈ దారుణం. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

    మదనపల్లె శివాజీ నగర్ కు చెందిన కదిర్ అహ్మద్ విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య రుక్సానా ఉంది. వీరికి ఆరేళ్ల కిందట వివాహమైంది. రుక్సానా మదనపల్లెలోని ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తోంది. వివాహం జరిగి మూడేళ్లు అవుతున్న ఆమెకు పిల్లలు పుట్టలేదు. దీంతో కదిర్ అప్పారావు తోటకు చెందిన అయోషను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మొదటి భార్య రుక్సా నాకు 18 నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. అప్పటినుంచి కదీర్ మొదటి భార్య రుక్సానా తోనే ఉంటున్నాడు. రెండో భార్య అయోష వద్దకు వెళ్లడం లేదు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదటి భార్య ఉండగానే తనను మోసగించి పెళ్లి చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. అయితే రుక్సానా పనిచేస్తున్న కాలేజీ వద్దకు వెళ్లి అయోష సోదరులు, కుటుంబ సభ్యులు రెక్కి నిర్వహిస్తున్నారు. దీనిపై పలుమార్లు రుక్సానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు

    ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కాలేజీ నుంచి స్కూటీ పై వస్తున్న రుక్సానాను ఇద్దరు యువకులు వెంటాడారు. కళ్ళపై కారం పోసి.. గొంతులో కత్తిను దింపారు. దీంతో రుక్సానా కుప్ప కూలిపోయింది. సమీపంలో ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న మదనపల్లి పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. తాము ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని రుక్సా నా తల్లిదండ్రులు ఆరోపించారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ గంగాధర్ రావు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి అయోష సోదరుడు సులేమాన్, అతని స్నేహితులు అహ్మద్, ప్యారే జాన్ లను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ కేశప్ప వెల్లడించారు. రుక్సానా అనుమతితోనే కదీర్ అయోషాను వివాహం చేసుకున్నట్లు భావించి హత్య చేసినట్లు నిందితులు చెబుతున్నారు.