Cricket Six Girls Reaction: క్రికెట్ లో ఎన్ని రకాల ఫార్మాట్లు ఉన్నప్పటికీ..ఆడేది ఎంత గొప్ప ఆటగాళ్లు అయినప్పటికీ.. అంతిమంగా గ్లామర్ ఉంటేనే అది క్లిక్ అవుతుంది.. గ్లామర్ అంటే అమ్మాయిలే కాబట్టి.. ఆ అమ్మాయిల హావభావాలను కెమెరామెన్లు చూపిస్తేనే అసలైన కిక్కు వస్తుంది.. క్రికెట్ మ్యాచ్ ఫాలో అయ్యే వాళ్ళకు.. ఆటగాళ్లు సిక్స్ లు కొట్టగానే అమ్మాయిలు కనిపించడం ఒకరకంగా చూసేవాళ్ళకు ఉత్సాహంగా అనిపిస్తుంది.. కాకపోతే దీని వెనుక భారీ కసరత్తు ఉంటుంది.
Also Read: టీమిండియా.. ఇలాగైతే కష్టమే..
ఇటీవల ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ధోని క్యాచ్ అవుట్ అయ్యాడు. సమయంలో ఒక అమ్మాయి ఒక రకంగా తన హావభావాన్ని ప్రదర్శించింది. ప్రపంచం మొత్తం మునిగిపోయినట్టు.. దేశం మొత్తం అల్లకల్లోలం జరిగినట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఆ అమ్మాయిని అద్భుతంగా క్యాప్చర్ చేశాడు వీడియో గ్రాఫర్. ఇంకేముంది ఒక్కసారిగా ఆమె సెలబ్రిటీ అయిపోయింది. ఆమె సామాజిక మాధ్యమాలకు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగి పోయారు. బ్లింక్ ఇట్ అనే కంపెనీ ఆమెతో ఒప్పందం కూడా కుదురుచుకుంది. అంటే ఒక వీడియో ఆ అమ్మాయి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమెను సెలబ్రిటీని చేసేసింది.
క్రికెట్లో అందమైన అమ్మాయిలను ఎందుకు చూపిస్తారు అంటే.. ఆటకు అందం తేవడానికి.. పైగా క్రికెట్ చూసేందుకు అమ్మాయిలు ప్రత్యేకంగా ముస్తాబయి వస్తుంటారు. కొంతమంది అమ్మాయిలు తమదైన హావభావాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటారు. కొంతమంది క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అలరిస్తూ ఉంటారు. అటువంటివారిని క్యాప్చర్ చేయడానికి ప్రత్యేకంగా కెమెరామెన్లు ఉంటారు. వారంతా కూడా ముందుగానే ఆ అమ్మాయిలపై దృష్టి కేంద్రీకరించి.. కెమెరాలను వారి వైపు ఫోకస్ చేస్తారు. అభిమాన ఆటగాడు అద్భుతంగా ఆడితే.. లేదా వికెట్లు పడగొడితే ఆ అమ్మాయిలు ఎగిరి గంతులు వేసినప్పుడు.. వారి వైపు ఫోకస్ చేస్తారు.
Also Read: ఆకాశ్ దీప్.. నైట్ వాచ్ మెన్.. ఇంగ్లాండ్ ను చీల్చిచెండాడాడు.. ఇదీ ఆటంటే?
వారు కెమెరాలలో ప్రధానంగా కనిపించిన తర్వాత.. కామెంట్రీ బాక్స్ లో వ్యాఖ్యాతలు తమదైన వ్యాఖ్యానాన్ని ఆ అమ్మాయిల హావభావాలకు జోడిస్తారు. దీనివల్ల చూసేవాళ్ళకు మరింత ఆనందం కలుగుతుంది. ఆటకు అదనపు గ్లామర్ తోడు అవుతుంది. తద్వారా టిఆర్పి రేటింగ్స్ పెరుగుతుంటాయి. ఐపీఎల్ లో ఇదే స్ట్రాటజీని కొనసాగిస్తారు. ప్రస్తుతం ఐసీసీ నిర్వహించే ఈవెంట్లకు కూడా ఈ స్ట్రాటజీనే అమలు చేస్తున్నారు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా గ్లామర్ అద్దిస్తూ.. అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు. ఐపీఎల్ ప్రారంభంలో చీర్ లీడర్స్ గా అమ్మాయిలను చూపించేవారు. ఆటగాళ్లు బౌండరీలు, సిక్స్ లు, వికెట్లు తీయగానే చీర్ లీడర్స్ ఎగిరి గంతులు వేసేవారు. ఆటకు అదనపు అందాన్ని తీసుకురావడానికి చీర్ లీడర్స్ ను అప్పట్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.. కేవలం చీర్ లీడర్స్ ను చూసేందుకే చాలామంది అభిమానులు మైదానాలకు వచ్చేవారంటే అతిశయోక్తి కాదు.
The match is nothing like the way she is reacting but she knows that the trend is set in IPL that the cameraman shows the girls more and the match less, especially when you are associated with Bollywood. pic.twitter.com/dCs7lZCdSm
— Shubhangi Pandit (@Babymishra_) April 21, 2025